Site icon vidhaatha

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నాగ చైతన్య

విధాత:తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య నటించబోతున్నాడని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని పూర్తి చేశాడు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు విక్రం కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా అలాగే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ అమీర్ ఖాన్‌తో కలిసి ‘లాల్ సింగ్ చద్దా’ చేస్తున్నాడు. వీటి తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చైతు సినిమా ఉండబోతుందట. దీనిని ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు నిర్మిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తరుణ్ భాస్కర్ చెప్పిన కథ నిర్మాత డి.సురేష్ బాబుకి నచ్చడంతో, చైతుకి చెప్పమని సలహా ఇచ్చారట. ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్‌లో భాగంగా లడఖ్‌లో ఉన్న చైతు తిరిగిరాగానే దర్శకుడు కథ వినిపించబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయట.

Exit mobile version