Site icon vidhaatha

BUJJI| ప్ర‌భాస్ బుజ్జి నాగ చైత‌న్య చైతుల్లోకి.. అస‌లు ఏం జ‌రుగుతుంది?

BUJJI|  ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క‌ల్కి మూవీ జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో మేకర్స్ సినిమా ప్ర‌మోష‌న్స్ వేగవంతం చేశారు. రీసెంట్‌గా ఓ స్పెష‌ల్ ఈవెంట్ ఏర్పాటు చేసి భైరవ(ప్రభాస్ పాత్ర పేరు) నడిపే వెహికల్ బుజ్జికి సంబంధించిన గ్లింప్స్ ని విడుద‌ల చేశారు. ఇక వేదిక‌పైకి ప్ర‌భాస్ బుజ్జితోనే వ‌చ్చి అందరికి పెద్ద షాక్ ఇచ్చాడు. అయితే బుజ్జి గురించి గ‌త కొద్ది రోజులుగా అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. దాదాపు ఏడు కోట్ల రూపాయ‌ల‌తో దానిని రూపొందించార‌ని, దీనిని త‌యారు చేసేందుకు ఇంజ‌నీర్స్ చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ప్ర‌భాస్ వాహ‌నం అయిన బుజ్జి ఇప్పుడు నాగ చైత‌న్య చేతుల్లోకి వెళ్లింది.

బుజ్జి కారును నాగ చైతన్య నడిపి ఆ త‌ర్వాత త‌న ఎక్స్‌పీరియ‌న్స్ తెలియ‌జేశాడు. ఇప్ప‌టికీ నేను న‌మ్మ‌లేక‌పోతున్నాను. ఇంజ‌నీరింగ్ నియ‌మాల‌ని బుజ్జి బ్రేక్ చేసింద‌ని నాగ చైతన్య అన్నాడు. బుజ్జి కారులో నాగ చైత‌న్య ర‌య్యిమంటూ దూసుకుపోతూ సంద‌డి చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. అయితే బుజ్జి ఫ్యూచరిస్టిక్ కారు కాగా, అది ప్రభాస్ తో మాట్లాడుతుంది. ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకుంటుంది. అప్పుడప్పుడు అత‌నికి చిరాకు కూడా తెప్పిస్తుంది. సినిమాలో ఈ కారుదే కీ రోల్ అని యూనిట్ చెబుతోంది. అందుకే దేశంలోని ఆటోమొబైల్ నిపుణులను సంప్రదించి ఈ కారును తయారు చేయించుకున్నాడు నాగ్ అశ్విన్.

మహీంద్రా అండ్ జయేమ్ ఆటోమోటివ్ సంస్థలు సంయుక్తంగా బుజ్జి కారును రూపొందించాయి. మూడు చక్రాలు ఉండే బుజ్జి కారు టైర్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. రిమ్ హైట్ 34.5 అంగుళాలు కాగా, ఈ భారీ టైర్స్ రూపొందించడానికి చాలా సమయం పట్టింది. ఇక దీనికి హబ్ లెస్ టైర్స్ వాడారు. ఈ కారు బరువు దాదాపు 6 వేల కేజీలు. పవర్ 94 కిలో వాట్స్, టార్క్ 9800NM , బ్యాటరీ 47kwh . కారులో ప్రత్యేకమైన ఓ ఛాంబర్ ఉంటుంది. అందులో హీరో శత్రువులను బందీలుగా అందులో ఉంచుతాడట. కారు వెనుక భాగంలో ఒక టైర్ మాత్రమే ఉంటుంది. అది అన్ని కోణాల్లోకి తిరుగుతుంది.

Exit mobile version