Site icon vidhaatha

Samantha| శోభిత‌తో ఎంగేజ్‌మెంట్‌కి ముందు సమంత ఫొటోల‌న్నీ డిలీట్ చేసిన చైతూ.. ఇది మాత్రం తీసేయ‌లేదు ఎందుకు?

Samantha| అక్కినేని నాగార్జున బాట‌లో ప‌య‌నిస్తున్నాడు అక్కినేని నాగ చైత‌న్య‌. త‌న తండ్రి నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకోగా, ఇప్పుడు చైతూ కూడా రెండో పెళ్లికి సిద్ధ‌మ‌య్యాడు.రీసెంట్‌గా ప్ర‌ముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల‌తో ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకున్నాడు. వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. ఒక హీరోయిన్‌తో విడాకులు కాగా, మ‌ళ్లీ మరో హీరోయిన్‌తో నిశ్చితార్థం జ‌రుపుకోవ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. అయితే స‌మంత‌- నాగ చైత‌న్య‌ల‌ది చూడ ముచ్చ‌టైన జంట అని వారిద్ద‌రు విడిపోవ‌డం అస్స‌లు ఎవ‌రికి న‌చ్చ‌లేదు. తిరిగి క‌లుస్తారేమోన‌ని వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్న స‌మ‌యంలో చైతూ..శోభిత‌తో ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకున్నాడు.

ఇదిలా ఉంటే శోభితతో నిశ్చితార్థానికి ముందే సమంతతో ఉన్న పాత‌ జ్ఞాపకాలను అన్నింటిని పూర్తిగా తొలగించేశాడు నాగ చైతన్య. ఇన్ స్టా గ్రామ్ లో సమంతతో ఉన్న ఒక పిక్స్ అన్నింటిని డిలీట్ చేసిన నాగ చైత‌న్య ఒక పిక్‌ని మాత్రం అలానే ఉంచాడు. ఈ ఫొటో వాళ్లిద్దరూ కలిసి నటించిన మజిలీ సినిమా లోనిది అని అంటున్నారు. ఆ సినిమా పోస్టర్ లో సామ్ స్టైలిష్ గా కనిపిస్తుండగా..నాగ చైతన్య మాత్రం తలకు హెల్మెట్ తో ఉన్నాడు. 2018లో పోస్ట్ చేసిన ఈ ఫొటోకు ‘మిసెస్ అండ్ గర్ల్‌ఫ్రెండ్’ అనే క్యాప్షన్ ఇచ్చాడు అక్కినేని హీరో. ఈ ఫోటో చాలా క్యూట్ గా కూడా ఉంది. అయితే ఈ ఫొటో చైతూ డిలెట్ చేయకపోవడానికి కారణం ఏంటీ అని ఫ్యాన్స్ అంతా ఆలోచనలో పడ్డారు.

ఏడెనిమిదేళ్లు ప్రేమించి.. మూడేళ్లు కాపురం చేసిన వ్యక్తి ని అంత ఈజీగా ఎవ‌రు మ‌రిచిపోతారు.. చైతూ సమంతను మర్చిపోలేకపోతున్న నేప‌థ్యంలోనే ఇలా ఆమె ఫొటో ఒక‌టి ఉంచుకొని ఉంటాడ‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆగ‌స్ట్ 8న నాగార్జున ఇంట్లో చాలా సింపుల్ గా నాగ చైత‌న్య‌- శోభిత‌ నిశ్చితార్దం జరిగింది. కాగా పెళ్ళి డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాదే చైతూ రెండో పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు. స‌మంత నుండి విడిపొయాక చాలా బాధ‌ప‌డ్డ చైతూ ఇప్పుడు సంతోషంగానే ఉన్నాడ‌ని నాగార్జున చెప్పుకొచ్చాడు.

Exit mobile version