Site icon vidhaatha

Naga Chaitanya – Sobhita | హీరో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం

ట్విటర్ ఎక్స్‌లో వెల్లడించిన హీరో నాగార్జున

విధాత, హైదరాబాద్ : మా కుమారుడు హీరో నాగచైతన్యతో, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం ఉదయం 9:42 గంటలకు జరిగినట్లుగా హీరో అక్కినేని నాగార్జున ట్విటర్ ఎక్స్‌వేదికగా వెల్లడించారు. ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నామని తెలిపారు. హ్యాపీ కపుల్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ప్రేమానురాగాలు, సుఖసంతోషాలతో జీవించాలని, ఇద్దరిపై దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామంటూ నిశ్చితార్థం విషయాన్ని నాగార్జున అందరితో షేర్ చేసుకున్నాడు. కొత్త జంటతో నాగార్జున ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గతంలో నాగ చైతన్య హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకున్నారు. 2010లో విడుదలైన ‘ఏమాయ చేశావే’ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించినప్పటి నుంచి వీరి మధ్య పరిచయం పెరిగింది. 2017 అక్టోబర్ 6వ తేదీన గోవాలో వీరు హిందు, క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల వారి వైవాహిక బంధానికి విడాకులతో 2021ఆక్టోబర్ 2న తెరపడింది. సమంత, నాగచైతన్యల విడాకుల అనంతరం నాగచైతన్య హీరోయిన్ శోభితతో ప్రేమాయణ సాగిస్తున్నారు. వీరిద్ధరు ఇప్పుడు ఏకంగా నిశ్చితార్ధం కూడా చేసుకోవడంతో ఇక నాగ చైతన్య రెండో పెళ్లి త్వరలో జరుగనుంది.

Exit mobile version