Akkineni| సమంత( Samantha) నుండి విడిపోయిన తర్వాత టాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో సీక్రెట్ ఎఫైర్ నడిపిన నాగ చైతన్య(Naga Chaitanya) ఆగస్ట్8న నిశ్చితార్థం జరుపుకున్నారు. అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగిది. ఇక నాగార్జున ఎంగేజ్‌మెంట్ పిక్స్ షేర్ చేశాడు.పెళ్ళికి కాస్త సమయం ఉందని తెలిపారు. కాగా ఎంగేజ్మెంట్ అనంతరం మొదటిసారి నాగ చైతన్య, శోభిత కెమెరా కంటికి చిక్కారు. వారు లిఫ్ట్ లో ఉన్న ఫోటో వైరల్ అయింది. బ్లాక్ డ్రెస్ లో గాగుల్స్ ధరించి ఉన్న ఈ జంట చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఇక ఈ ఫొటో ఇలా వచ్చిందో లేదో ఇప్పుడు అక్కినేని ఇంట జరుగుతున్న వేడుకకి సంబంధించిన మరి కొన్ని ఫొటోలు బయటకి వచ్చాయి.
అక్కినేని నాగచైతన్య- నటి శోభిత ధూళిపాళ్ల పెళ్లి పనులు సోమవారం ప్రారంభం కాగా, ఈ విషయాన్ని శోభిత(Sobhita) తన ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది. ‘గోధుమ రాయి పసుపు దంచడం, మొదలైపోయింది’ అంటూ పోస్ట్సు షేర్ చేయగా, ఇందులో శోభిత స్వయంగా పసుపు దంచుతున్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల్లో శోభితా సంప్రదాయంగా కనిపించారు. ఎరుపు రంగు, గోధుమ వర్ణం పట్టు చీరలో శోభిత మెరిసిపోతూ కనిపించారు. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ పెళ్లి ఎప్పుడో చెప్పాలంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి దానికి వీరు ఏమైన స్పందిస్తారా అన్నది చూడాలి.
నాగ చైతన్య పెళ్లి గురించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. 2025 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding)ప్లాన్ చేస్తున్నారంటూప్రచారాలు సాగిన దానిపై ఎవరు స్పందించింది లేదు.. విదేశాల్లో వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే వైజాగ్ లో వివాహం జరగనుందట. అక్కడే పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారట. శోభిత వైజాగ్ లో చదువుకోవడం విశేషం. ఇక రెండేళ్లకు పైగా నాగ చైతన్య-శోభిత రిలేషన్ లో ఉండగా, పలుమార్లు వారిద్దరికి సంబంధించిన ఫొటోలు బయటకు రాగా, వాటిని ఈ జంట ఏ నాడుఖండించలేదు. చివరికి నాగార్జున కొత్త కోడలు శోభిత ధూళిపాళ్లని అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానం పలికాడు.