Site icon vidhaatha

Naga Chaitanya-Sobhita|నాగ చైత‌న్య‌,శోభిత‌ల పెళ్లి తేదీపై క్లారిటీ వ‌చ్చేసింది.. వేదిక ఎక్క‌డంటే..!

Naga Chaitanya-Sobhita|సీక్రెట్‌గా ప్రేమించుకున్న నాగ చైత‌న్య‌,శోభిత‌లు ఈ ఏడాది ఆగ‌స్ట్ 8న నిశ్చితార్థం జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. అప్ప‌టి వర‌కు వారిద్ద‌రికి సంబంధించి నెట్టింట అనేక ప్ర‌చారాలు సాగిన వాటిని కొట్టిప‌డేశారు. అయితే నిశ్చితార్థం త‌ర్వాత నాగార్జున(Nagarjuna) త‌న ఎక్స్‌లో ఎంగేజ్‌మెంట్ పిక్స్ షేర్ చేశాడు. మా కుమారుడు నాగ చైతన్య, శోభితా దులిపాలల నిశ్చితార్థం ఈ ఉదయం 9:42 గంటలకు జరిగింది అని చెప్పడానికి సంతోషిస్తున్నాము అని వారు ప్రకటించారు. ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. నూతన జంటకు అభినందనలు! వారికి జీవితాంతం ప్రేమ, ఆనందం కలగాలని కోరుకుంటున్నాము. దేవుడు దీవించుగాక! 8.8.8. అనంతమైన ప్రేమ ప్రారంభం.” అనే సందేశాన్ని నాగార్జున త‌న ట్వీట్‌లో పెట్టారు.

ఇక నిశ్చితార్థం త‌ర్వాత వీరి పెళ్లి ఎప్పుడు అనే దాని గురించి చ‌ర్చ న‌డుస్తుంది. ఇటీవ‌ల శోభిత(Sobhita) విశాఖపట్నంలోని తన ఇంట్లో జ‌రిగిన‌ పెళ్లి వేడుకలకి సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. పసుపు దంచటం వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేసింది. ఈ పవిత్ర సందర్భంగా నటి సాంప్రదాయ పట్టు చీర, బంగారు నగలు, తక్కువ మేకప్‌తో కనిపించింది. అయితే ఈ పిక్స్ చూసిన వారంద‌రు త్వ‌ర‌లోనే చైతూ,శోభిత వివాహం జ‌ర‌గ‌నుంద‌ని డిసైడ్ అయ్యారు. అయితే పెళ్ళి ఎప్పుడు చేయబోతున్నారు.. ఎక్కడ చేయబోతున్నారు అనే వివరాలకోసం అంద‌రు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ జంట ఈ ఏడాది చివర్లో పెళ్ళి చేసుకోబోతున్నారు. అది కూడా పెద్దగా హంగు ఆర్బాటాలు లేకుండా.. చాలా దగ్గర సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే పెళ్లి చేయాల‌ని నాగార్జున భావిస్తున్నార‌ట‌. నాగచైతన్య , శోభితల పెల్లి డిసెంబర్ 4న జరగనుందని డెక్కన్ క్రానికల్ ఒక కథనాన్ని ప్రచురించింది. మ‌రి దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న అయితే ఇంత వ‌ర‌కు రాలేదు. ఇక ఇదిలా ఉంటే అక్కినేని నాగేశ్వరరావు (ANR) జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో నాగ చైతన్య, శోభితా జంటగా తొలిసారి కనిపించారు. కెమెరాలకు పోజులిస్తూ, చిరునవ్వులు చిందిస్తూ ఈ జంట వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించారు. కాబోయే కోడ‌లిని నాగార్జున అంద‌రికి ప‌రిచ‌యం చేశారు.

Exit mobile version