Nagarjuna|టాలీవుడ్‌లో ఇప్పటికీ యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ ఎవరంటే ఠక్కున మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు నాగార్జున. ఆయనని చూస్తే నాగార్జునకి ఆరు పదుల వయస్సు వచ్చిందా అని ఆశ్చర్యం కలుగక మానదు. మొదటి నుండి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన నాగార్జున ఇప్పటికీ యువకుడి మాదిరిగా కనిపిస్తుంటారు. అయితే నాగార్జునకి ఎలాంటి చెడు అలవాట్లు లేవా అనే సందేహం అందరిలో ఉంటుంది.యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు నాన్న ఏఎన్నార్‌కి తెలియకుండా నాగార్జున బీర్ తాగేవారట. దొంగచాటుగా ఆ పని చేసేవాడిని అని నాగార్జుననే ఓ సందర్భంలో తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు ఇంట్లో చాలా సిస్టమాటిక్ ఫాదర్‌గా ఉండేవారు.
ఆయన పిల్లల విషయంలో ఎంతో స్ట్రిక్ట్ అని, అల్లరి చిల్లరగా తిరగనిచ్చేవారు కాదు అని నాగ్ అన్నారు. వెంకట్, ఇతర ఆడపిల్లలంతా బాగా ఉండేవారు, కానీ నాగ్ మాత్రం కొంటె పనులు ఎక్కువగా చేసి పేరెంట్స్ ముందు దొరికిపోయేవాడట. నాగ్‌కి బీర్ తాగే ఆలవాటు ఉండగా, ఏఎన్నార్‌కి తెలిస్తే కొడతాడని చెప్పి దొంగచాటున ఆ బాటిల్ లేపేవాడట. అందుకోసం అన్నపూర్ణ స్టూడియోని వాడుకునేవాడట. అందులో స్టూడియోతోపాటు ఓ ఖాళీ ప్లేస్ కూడా ఉండేది. దట్టమైన చెట్ల మధ్యకి నెమ్మదిగా వెళ్లి బాటిల్ తీసుకొని అక్కడ ఎవరు చూడకుండా బీర్ లేపేవాడట నాగార్జున.
ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో నాగార్జున ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. తనకు తెలియని ప్లేస్‌లు ఇందులో చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పుడు నాగార్జున చాలా పద్దతిగా ఉంటూ ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాను అన్నీ తింటానని, కానీ రాత్రి పడక ముందే అన్నీ కంప్లీట్ చేస్తానని తెలిపారు నాగ్. వైన్ కూడా కొద్దిగా తీసుకుంటానని, నాన్ వెజ్‌తోపాటు, వెజ్ కూడా తీసుకుంటానని తెలిపారు. నాటు కోడి అంటే చాలా ఇష్టమని , రాత్రి పడుకునే ముందు కొంత స్వీట్ తీంటానని కూడా నాగార్జున వెల్లడించారు.ఇక నాగార్జున ఇప్పుడు ధనుష్ హీరోగా రూపొందుతున్న `కుబేర` సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. రజనీకాంత్‌తో కలిసి `కూలీ` సినిమాలో నటిస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 షోకి హోస్ట్ గా చేస్తున్నారు నాగ్.