KTR vs Konda Surekha | నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యల ఉదంతంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకున్నది. తాను చేసిన వ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశంలో సంచలనం రేపడం, ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే. మంత్రి కేటీఆర్ సైతం లీగల్ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది.
— chaitanya akkineni (@chay_akkineni) October 3, 2024
కొండా సురేఖ వ్యాఖ్యలపై బుధవారమే నాగార్జున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున సైతం కోర్టులనాశ్రయించారు. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు బీఎన్‌ఎస్ సెక్షన్ 356 కింద నాంపల్లి కోర్టులో సురేఖపై ఆయన పరువు నష్టం కేసు వేశారు. ఫిర్యాదు కాపీని నాగార్జున కుమారుడు నాగ చైతన్య సోషల్ మీడియాలో షేర్ చేశారు.