Nagarjuna| సమంత నుండి విడిపోయిన తర్వాత చాలా కాలం పాటు సింగిల్‌గా ఉన్న నాగ చైతన్య రీసెంట్‌గా శోభిత దూళిపాళ్లతో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్నాడు. అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల వ్యవహారం సినీ పరిశ్రమలో ఎప్పటి నుండో చర్చనీయాంశం అవుతుంది. వారిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొన్నేళ్లుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వాటిని ఈ ఇద్దరు ఏ సందర్భంలో కనీసం ఖండించనూ లేదు. అయితే నిప్పు లేకుండా పొగరాదు కదా అని వీరిద్దరి విషయంలో సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. ఇదే క్రమంలో ఆగస్ట్ 8న నాగార్జున ఇంట్లో నాగ చైతన్య, శోభితల ఎంగేజ్‌మెంట్ జరిగింది.
అయితే తాజాగా నాగార్జున ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ తన కొడుకుకి సంబంధించి పలు విషయాలు షేర్ చేశాడు. సమంత నుండి విడిపోయిన తర్వాత చై చాలా నరక వేదన అనుభవించాడు అని తెలియజేశాడు. అయితే ఆ బాధని ఎవరితో చెప్పుకోలేదు. ఇప్పుడు నా కొడుకు సంతోషంగా ఉండడం మాకు ఆనందంగా ఉంది అంటూ నాగార్జున ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఇక . చై, శోభిత వివాహం గురించి స్పందిస్తూ.. వీళ్లిద్దరి పెళ్ళికి కాస్త సమయం తీసుకుంటాం అని నాగార్జున తెలిపారు. బహుశా కొన్ని నెలలు ఆలస్యంగా వీరి వివాహం జరిగే అవకాశం ఉన్నట్టుగా ఆయన తెలియజేశారు. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తుండగా, శోభిత కూడా పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తుంది.
ఇక ఇదిలా ఉంటే నాగార్జున తనకి కాబోయే కోడలు శోభిత గురించి ఓ సందర్భంలో స్టన్నింగ్ కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. . 2018లో అడవి శేష్ నటించిన గూఢచారి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది శోభితా. ఈ సినిమా పెద్ద హిట్ కావడంతో గూఢచారి సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ సక్సెస్ మీట్‌లో శోభిత ధూళిపాళ గురించి నాగార్జున ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘శోభితా ధూళిపాళ చాలా బాగుంది. నేను ఇలా చెప్పకూడదు కానీ, సినిమాలో ఆమె చాలా హాట్‌గా ఉంది’ అని నాగార్జున చెప్పగా, ఇప్పుడు ఆ వీడియోని నెట్టింట తెగ వైరల్ చేస్తూ ఇలా అన్నాడేంట్రా అని కొందరు ముచ్చటించుకుంటున్నారు.