Nara Lokesh| క‌ల్కి హిట్‌పై నారా లోకేష్ ఆస‌క్తిక‌ర ట్వీట్.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Nara Lokesh| యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ ప్ర‌ధాన పాత్ర‌లో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన చిత్రం క‌ల్కి. ఈ సినిమా ఎన్నో భారీ అంచ‌నాల నేడుమ ప్రేక్ష‌కుల ముందు

  • Publish Date - June 27, 2024 / 02:32 PM IST

Nara Lokesh| యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ ప్ర‌ధాన పాత్ర‌లో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన చిత్రం క‌ల్కి. ఈ సినిమా ఎన్నో భారీ అంచ‌నాల నేడుమ ప్రేక్ష‌కుల ముందుకు రాగా, మూవీ పెద్ద విజ‌యం సాధించింది. భారీ బడ్జెట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రంలో స్టార్ నటీనటులు, అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో మెప్పించాయి. మూవీ విజ‌యం ప‌ట్ల ప్ర‌భాస్ ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక చిత్రంలో ప్ర‌భాస్ ప‌ర్‌ఫార్మెన్స్ కి మంచి మార్కులు ప‌డ్డాయి.. ప్రభాస్ ముందు కామెడీగా కనిపించి తర్వాత యాక్షన్ చేసాడు. క్లైమాక్స్ లో ప్రభాస్ ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది అని చెప్పాలి.

ఇక ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నా బెన్, మాళవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ ఇలా ప్ర‌తి ఒక్క‌రు కూడా మూవీకి త‌గు న్యాయ చేశారు. వారి వారి పాత్ర‌లలో జీవించేశారు. ఇప్పుడు అంద‌రు కూడా మూవీకి అదిరిపోయే రివ్యూలు ఇస్తుండ‌డం ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మ‌రోవైపు ఈ సినిమాకు హిట్ టాక్ రావ‌డం పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు. సినిమాకు మంచి రివ్య్వూలు రావ‌డం త‌న‌కు ఎంతో సంతోషాన్ని ఇస్తుంద‌ని అన్నారు. క‌ల్కి సినిమా హిట్టైనందుకు ప్ర‌భాస్‌, అమితాబ్‌, క‌మ‌ల్ హాస‌న్‌, దీపికా ప‌దుకోన్‌, ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌ల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

అలానే తెలుగు సినిమా ఖ్యాతిని మ‌రో స్థాయికి తీసుకువెళ్లినందుకు చిత్ర నిర్మాతలు అశ్వినీద‌త్ తో పాటు ఆయ‌న కూతుళ్లు స్వ‌ప్న, ప్రియాంక‌లు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. కాగా, లోకేష్ ఈ మ‌ధ్య కాలంలో మంచి సినిమాల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే మంత్రి అయిన త‌ర్వాత లోకేష్ ఓ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించ‌డం తొలిసారి కావ‌డంతో ఆయ‌న చేసిన ట్వీట్‌కి ప్రాధాన్య‌త ఏర్ప‌డింది .ఇక క‌ల్కి చిత్రంలో ప్రభాస్ – అమితాబ్ మధ్య ఇంటర్వెల్ కి ముందు, క్లైమాక్స్ లో యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి.. కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ కి ఈ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చినందుకు నార్త్ ఆడియన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Latest News