NBK 109| బాల‌య్య బ‌ర్త్ డే స్పెష‌ల్.. డ‌బుల్ ట్రీట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

NBK 109| ఈ రోజు నంద‌మూరి బాల‌య్య బ‌ర్త్ డే కావ‌డంతో ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్స్ అందుతున్నాయి. ఈ రోజు ఉద‌యం బోయపాటి శ్రీనుతో చేయాల్సిన సినిమా ప్రకటన రాగా, బీబీ4 అంటూ ఒక పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. అఖండ త‌ర‌హాలో ఈ సినిమా ఉంటుంద‌ని అర్ధ‌మైంది. ఇక కొద్ది సేప‌టి క్రితం బాబీ దర్శకత్వం

  • Publish Date - June 10, 2024 / 01:33 PM IST

NBK 109| ఈ రోజు నంద‌మూరి బాల‌య్య బ‌ర్త్ డే కావ‌డంతో ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్స్ అందుతున్నాయి. ఈ రోజు ఉద‌యం బోయపాటి శ్రీనుతో చేయాల్సిన సినిమా ప్రకటన రాగా, బీబీ4 అంటూ ఒక పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. అఖండ త‌ర‌హాలో ఈ సినిమా ఉంటుంద‌ని అర్ధ‌మైంది. ఇక కొద్ది సేప‌టి క్రితం బాబీ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న `ఎన్బీకే109` గ్లింప్స్ విడుద‌లైంది.. సుమారు నిమిషం పాటు సాగే ఈ గ్లింప్స్ అదిరిపోయేలా ఉంది. బాలయ్య పాత్ర ఎలివేషన్‌ చూపించేలా ఈ గ్లింప్స్ సాగింది. జాలి, దయ పదాలకు అర్థం తెలియని ఓ అసురుడిగా బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నట్లు హింట్ ఇచ్చారు. టైటిల్ ప్ర‌క‌టించ‌క‌పోయిన క‌థ‌కి సంబంధించిన క్లూస్ ఇచ్చారు.

బాలయ్య బందిపోట్ల అంతు చూసే వేటగాడిగా ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడ‌ని అర్ధ‌మ‌వుతుంది. మకరంద్ దేశ్ పాండే హీరో క్యారెక్టరైజేషన్ ని వర్ణిస్తూ, దుర్మార్గులకు కూడా దేవుడు కొన్ని వరాలు ఇస్తాడని, వాళ్ళ అంతు చూసేందుకు జాలి దయ లేని ఒక అసురుడు కావాలని చెప్పించడాన్ని బట్టి లైన్ చూచాయగా అర్థమవుతోంది. కరుడు గట్టిన రాక్షసులను ఎవ‌రు అంతం చేయ‌లేని స‌మ‌యంలో బాల‌య్య వ‌చ్చి వారి అంతు చూస్తాడ‌నే టాక్ వినిపిస్తుంది. ఎనభై తొంబై దశకంలో జరిగిన కథగా దర్శకుడు బాబీ రాసుకున్నట్టు టాక్ ఉంది. వీరమాస్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ బాబీ బృందం ఏదీ ఖరారు చేయలేదు.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, ఊర్వశీ రౌతేలా, చాందిని చౌదరీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా, మ్యూజిక్ సంచలనం ఎస్ఎస్‌ తమన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంచితే, బాల‌య్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సినిమా టైటిల్, విడుద‌ల తేదీ కూడా రివీల్ చేస్తారని అభిమానులు భావించినా మేకర్స్ మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంచారు.

Latest News