Site icon vidhaatha

Priyanka chopra|ఆ వ్యాధి బారిన ప‌డ్డ ప్రియాంక చోప్రా భ‌ర్త‌..బెడ్‌పై నుండి లేవ‌లేని స్థితిలో ఉన్నాడా..!

Priyanka chopra| గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా సుప‌రిచితం. బాలీవుడ్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించిన ప్రియాంక చోప్రా కొన్ని డ‌బ్బింగ్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా ద‌గ్గ‌రైంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న స‌మ‌యంలో ప్రియాంక చోప్రా అమెరిక‌న్ న‌టుడు అయిన నిక్ జోనస్‌ని ప్రేమించి 2018లో వివాహం చేసుకుంది. ఇక వీరి పెళ్లి అప్పుడు అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. ప్రియాంక చోప్రా పెళ్లైన త‌ర్వాత కూడా త‌న భ‌ర్త‌తో క‌లిసి ప‌లు ఈవెంట్స్‌లో పాల్గొని సంద‌డి చేసింది. ఇక సోష‌ల్ మీడియాలోను వీరిద్ద‌రు క‌లిసి అల‌రిస్తుంటారు.

అయితే తాజాగా నిక్ జోనాస్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో షేర్ చేసి అభిమానులకి క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేస్తూ త‌న‌కు ఉన్న అరుదైన వ్యాధి గురించి తెలియ‌జేశాడు. ప్ర‌స్తుతం ఇన్‌ఫ్లుఎంజా-ఎ (ఎపిడెమిక్ వ్యాధి) తో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలియ‌జేస్తూ, దాని వ‌ల‌న మ్యూజిక‌ల్ షో చేయ‌లేక‌పోతున్న‌ట్టు పేర్కొన్నాడు. తరచూ మ్యూజిక్‌ కన్సర్ట్‌తో, షోస్‌తో బిజీగా ఉండే నిక్‌ జోనస్ ఈ వ్యాధి వ‌ల‌న గత మూడు రోజులు నుండి బెడ్‌కే పరిమితమయ్యానంటూ తెలియజేశాడు.ఆ వ్యాధి వ‌ల‌న త‌న ఆరోగ్యం బాగా క్షీణించింది అని తెలియ‌జేస్తూ.. గొంతు నొప్పితో బాధపడుతున్నాను. అస్సలు మాట్లాడలేకపోతున్నా.. ఒక రోజు మొత్తం తీవ్ర జ్వరంతో బాధ‌ప‌డ్డాను.

ప్ర‌స్తుతం నాకు మా ఫ్యామిలీ డాక్టర్ చికిత్స అందిస్తున్నారు. విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఆగ‌స్ట్‌లో తిరిగి నా ప్రోగ్రామ్‌ని నిర్వ‌హిస్తాను. అర్ధం చేసుకుంటార‌ని అనుకుంటున్నాను. ధన్యవాదాలు అంటూ త‌న పోస్ట్‌లో రాసుకొచ్చాడు నిక్ జోనాస్. ఇక తన షో రీ షెడ్యూల్ వ‌చ్చేసి మెక్సికో సిటిలో ఆగస్ట్‌ 21, 22న. మాంటెర్రేలో జరిగే షోస్‌ని ఆగస్ట్‌ 24,25 తేదీల్లో నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు తెలియ‌జేశాడు. నిక్ జోనాస్ పాప్ సింగ‌ర్‌గా చాలా సుప‌రిచితం. గ‌తంలో ఆయ‌న చాలా షోలు నిర్వ‌హించ‌డం మ‌నం చూశాం. ఇక ఇదిలా ఉంటే నిక్ వైఫ్ ప్రియాంక సిటాడెల్ సీక్వెల్ తో పాటు ది బ్లఫ్ హాలీవుడ్ పిరియాడిక్ డ్రామాలో హీరోయిన్ గా నటిసుంది.

Exit mobile version