Niharika| గత కొద్ది రోజులుగా అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీల వైరం గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుండడం మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ నంద్యాల నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటించడంతో మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు, జనసేన నాయకులు అల్లు అర్జున్‌పై భగ్గుమన్నారు. నాగబాబు అయితే అసహనం వ్యక్తం చేస్తూ.. ప్రత్యర్థులకు పనిచేసేవాడు మనవాడైనా పరాయివాడే అవుతాడు.. పరాయివాడై ఉండి మనతో పనిచేస్తుంటే మనవాడే అవుతాడు.. అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇది కచ్చితంగా అల్లు అర్జున్ గురించే చేశాడని ప్రచారం జరిగింది. దీని తర్వాత అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుని ట్రోల్ చేశారు.
ఇక నాగబాబు ఆ ట్వీట్‌ని డిలీట్ చేయడమే కాక ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ చేసి ఆ తర్వాత మళ్లీ యాక్టివేట్ చేశాడు. ఇక మెగా హీరో సాయిధరమ్ తేజ్.. అల్లు అర్జున్‌తో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డిని తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో వారిని అన్‌ఫాలో చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అల్లు ఫ్యామిలీ నుంచి కేవలం అల్లు శిరీష్‌ని మాత్రమే సాయి ఫాలో అవుతున్నారు. ఇక మెగా కుటుంబంలోని హీరోలు, ఇతర కుటుంబ సభ్యులందరికీ కలిపి ఓ వాట్సాప్ గ్రూప్ ఉండగా, ఇందులో వారి సినిమాల గురించి, ఫంక్షన్స్ గురించి, వ్యక్తిగత విషయాల గురించి పోస్ట్ చేస్తూ ఉంటారట. ఈ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ మీద మెగా హీరోలు చాలా ఆగ్రహంగా ఉన్నారనే టాక్ నడిచింది. మెగా ఫ్యాన్స్ చేసే డ్యామేజ్ కి భయపడే పుష్ప 2 వాయిదా వేశారని కూడా ఊహాగానాలు వినిపించాయి. అయితే అసలు బన్నీ గురించి మెగా ఫ్యామిలీలో ఏం నడుస్తుంది అనే దానిపై తాజాగా నిహారిక క్లారిటీ ఇచ్చింది. వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని నిహారిక పేర్కొంది.. అల్లు అర్జున్ ఎవరికి సపోర్ట్ చేస్తారో ఆయన వ్యక్తిగత విషయం. దానిపై మెగా ఫ్యామిలీలో ఎలాంటి వ్యతిరేకత లేదు, అన్నట్లు నిహారిక పరోక్షంగా చెప్పుకొచ్చింది. మరి ఇప్పటికైన ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ సైలెంట్‌గా ఉంటారా లేదా అనేది చూడాలి.