Niharika| అల్లు అర్జున్ ఇష్యూపై నిహారిక ఆస‌క్తిక‌ర‌కామెంట్.. ఊహించ‌లేదుగా..!

Niharika| గ‌త కొద్ది రోజులుగా అల్లు,మెగా కాంపౌండ్ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న‌ట్టుగా ప్ర‌చారాలు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌చార స‌మ‌యంలో అల్లు అర్జున్ చేసిన ప‌ని అగ్నికి ఆజ్యం పోసిన‌ట్టు అయింది. ఏపీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్య‌ర్ధికి ప్ర‌చారం చేయ‌డానికి నంద్యా

  • Publish Date - June 15, 2024 / 09:53 AM IST

Niharika| గ‌త కొద్ది రోజులుగా అల్లు,మెగా కాంపౌండ్ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న‌ట్టుగా ప్ర‌చారాలు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌చార స‌మ‌యంలో అల్లు అర్జున్ చేసిన ప‌ని అగ్నికి ఆజ్యం పోసిన‌ట్టు అయింది. ఏపీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్య‌ర్ధికి ప్ర‌చారం చేయ‌డానికి నంద్యాల వెళ్ల‌డంతో మెగా అభిమానులు, జ‌న‌సైనికుల‌తో పాటు మెగా ఫ్యామిలీ కూడా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.
“మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే” అంటూ కొణిదెల నాగబాబు చేసిన ట్వీట్ ఎంత చ‌ర్చ‌కి దారితీసిందో మ‌నం చూసాం. నాగ‌బాబు త‌న ట్వీట్‌లో అల్లు అర్జున్ పేరు రాయ‌క‌పోయిన కూడా ఆయ‌న‌ని ఉద్దేశించే అలా ట్వీట్ చేశాడ‌ని అంద‌రు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన కొన్ని గంటల్లోనే మెగా హీరో సాయిధుర్గ తేజ్‌ తీసుకున్న నిర్ణయం అంద‌రికి షాకిచ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మానికి అల్లు ఫ్యామిలీ ఎవ‌రు హాజ‌రు కాక‌పోవ‌డంతో సాయి తేజ్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్స్‌లో అల్లు అర్జున్‌ని అన్‌ఫాలో చేశారు. తేజ్‌ తప్ప.. మిగతా మెగా హీరోలందరూ అల్లు అర్జున్‌ను ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు. అయితే మిగతా వారు మనస్సులో ఏముంది ..వాళ్లు కూడా అల్లు అర్జున్ ని వదిలేద్దామనే నిర్ణయానికి వచ్చారా అనే దానిపై జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మ‌రోవైపు నాగబాబు కుమార్తె నీహారిక స్టాండ్ ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది.

తాజాగా ఈ వివాదం గురించి మీడియా వారు నిహారిక‌ని ప్ర‌శ్నించారు. దానికి ఆమె కాస్త జాగ్రత్తగా రియాక్ట్‌ అయింది. ‘కమిటీ కుర్రోళ్లు’ అనే సినిమా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమానికి హాజరైన నిహారికను అల్లు అర్జున్ ని సాయిదుర్గ తేజ్ అన్ ఫాలో చేయ‌డం విషయం గురించి చెప్పాలని అడిగారు. దానికి నిహారిక స్పందిస్తూ.. ఎవరి కారణాలు వారికి ఉంటాయని ఆమె చెప్పింది. దాంతో నీహారిక ఈ ఇష్యూ విషయంలో స్టాండ్ ఏమిటనే విషయం బయ‌ట‌కు వ‌స్తుంద‌ని అంద‌రు భావించ‌గా, చివరికి నిరాశే ఎదురైంది.

Latest News