Site icon vidhaatha

Kalki| క‌ల్కి చిత్రంలో క‌లి క‌మల్ హాస‌న్ కాదా.. ప్రొడక్ష‌న్ డిజైన‌ర్ చెప్పిన షాకింగ్ విష‌యాలు..!

Kalki| మ‌హాన‌టితో త‌న స‌త్తా ఏంటో చూపించిన నాగ్ అశ్విన్ అదే ఉత్సాహంతో ప్ర‌భాస్, అమితాబ్, దీపికా, క‌మ‌ల్ హాసన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌ల్కి అనే చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ సినిమా విడుద‌లై దాదాపు నెల రోజులు కావొస్తున్నా కూడా మూవీ క్రేజ్ ఇంకా త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ ఈ సినిమాకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. రెండు వారాల్లోనే రూ. 1000 కోట్లను వసూళ్ చేసి.. ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తిన ఈ సినిమా ఓవర్సీస్ లో అయితే రికార్డులు తిర‌గ‌రాస్తుంది. ఇటీవ‌ల భార‌తీయుడు 2 చిత్రం విడుద‌ల కాగా, ఈ మూవీ పెద్ద విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో క‌ల్కి హ‌వానే న‌డుస్తుంది.

ఇక మూవీకి సంబంధించిన అనేక ఆస‌క్తిక‌ర విష‌యాల‌ని ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌పెడుతున్నారు మేక‌ర్స్. కల్కి చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన నితిన్ జిహనీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కల్కి సీక్వెల్ గురించి ఇంట్రెస్టింగ్ విష‌యాలు తెలియ‌జేశారు. అత‌ను చెప్పిన మాట‌లు వింటే కల్కి సీక్వెల్ ఫ‌స్ట్ పార్ట్‌ని మించి ఉంటుంద‌ని అనిపినిస్తంది. తొలి పార్ట్ చూశాక అందరం కూడా ‘కలి’ పాత్రాధారి కమల్ హాసన్ అనుకున్నారు. కానీ అత‌ను కాద‌ని వివ‌రించారు. క‌ల్కిలో చూపించింది కేవ‌లం ఒకే కాంప్లెక్స్. కాని ప్రపంచంలో వేర్వేరు చోట్ల ఏడు కాంప్లెక్స్ ఉంటాయని, వాటన్నింటికీ.. సుప్రీమ్ యాస్కిన్ నాయకుడు అని నితిన్ జిహానీ తెలియ‌జేశారు.

సుప్రీమ్ యాస్కిన్ కంటికి కనిపించని ఓ శక్తి కింద పనిచేస్తుంటాడు. ఆ శక్తి ఏంటి? అనేది స్క్రీన్‌పైన చూస్తే బాగుంటుంద‌ని పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు జిహాని. అయితే క‌లి క‌మ‌ల్ కాద‌ని ఆయ‌న చెప్ప‌డంతో ఇప్పుడు ఆ పాత్ర పోషించేది ఎవ‌ర‌న్న ప్ర‌శ్న అంద‌రి మ‌దిలో మెదులుతుంది. కలి పాత్రను ఏ హీరోతో చేయిస్తున్నారో మ‌రి? నాగ్ అశ్విన్ పెద్ద స్కెచే వేశాడుగా అని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. నాగ్ అశ్విన్ విజ‌న్‌ని కూడా పొగిడేస్తున్నారు. కల్కి సీక్వెల్ లో ఎన్నో వింతలు చూపిస్తూ ప్రేక్ష‌కుల‌ని మ‌రింత ఎంట‌ర్‌టైన్ చేయ‌డం ఖాయం అని తెలుస్తుంది.

Exit mobile version