Site icon vidhaatha

Actress| పోలీసుల‌కి అడ్డంగా దొరికిన హీరోయిన్.. ఎన్నాళ్లు ఈ స్క్రిప్టెడ్ వీడియోలు అంటూ నెటిజ‌న్స్ ఫైర్

Actress| టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ‌. 2016లో వచ్చిన ఒరు నాల్ కూతు అనే తమిళ చిత్రం ద్వారా నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 2017లో వ‌చ్చిన ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంటరై ఆ త‌ర్వాత ప‌లు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల.. వైకుంఠపురములో’, ‘రెడ్’ అనే సినిమాలు చేసిన ఈ భామ ఆ చిత్రాల‌తో మంచి విజ‌యాలు ద‌క్కించుకుంది.

ఇక టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆశించిన విధంగా అవ‌కాశాలు అందుకోలేక‌పోయింది. విశ్వక్ సేన్‌తో ‘పాగల్’ అనే చిత్రంలో నటించి అల‌రించిన ఈ భామ ‘దాస్ కా ధమ్కీ’ అనే చిత్రంతో మరోసారి అతడితో జతకట్టి చ‌క్క‌టి విజ‌యాన్ని అందుకుంది. ఇక ప్ర‌స్తుతం ‘పార్టీ’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. అయితే తాజాగా నివేదా పేతురాజ్‌కి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది.అంద‌లో నివేదా కారులో ప్రయాణిస్తుండగా.. పోలీసులు ఆపారు. ఆ తర్వాత డిక్కీ ఓపెన్ చేయ‌మ‌ని చెప్ప‌గా ఆమె కాస్త త‌ట‌ప‌టాయించింది. కారు డిక్కీని చెక్ చేస్తామని పోలీసులు పదే పదే అనడంతో నివేదా పేతురాజ్ ‘ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. మీకు చెప్పినా అర్థం కాదు’ అంటూ కాస్త అయోమ‌యంగా చూసింది.

ఆ తర్వాత వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తిపై నివేదా దాడి చేసిన‌ట్టు కూడా వీడియోలో కనిపించింది. ఇది చూసిన వారు ప‌క్కా స్క్రిప్టెడ్ అని చెబుతున్నారు. నివేదా అమాయ‌క‌పు చూపులు న‌టిస్తున్న‌ట్టుగానే అర్ధ‌మ‌వుతున్నాయి. పోలీసుల డ్రెస్సింగ్, ఆ పోలీసులు వేసుకున్న క్రాక్స్ చెప్పులు చూసి ఇదేదో ప్ర‌మోష‌న్ కోస‌మే చేసింద‌ని ఇంకెన్నాళ్లు ఇలాంటి పాత ఐడియాలు అంటూ నెటిజ‌న్స్ తిట్టి పోస్తున్నారు.

Exit mobile version