Site icon vidhaatha

NTR|ఆ ఫొటో షేర్ చేస్తూ దేవ‌ర మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన ఎన్టీఆర్…!

NTR| ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం దేవ‌ర‌. ఈ మూవీ గ‌త కొద్ది రోజులుగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.అయితే ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. “దేవర పార్ట్ 1కి సంబంధించి నా చివరి షాట్ ను కంప్లీట్ చేసుకున్నాను. ఇదొక అద్భుతమైన ప్రయాణం. ఇందులో మూవీ టీమ్ చూపించిన సముద్రమంత ప్రేమకు నా ధన్యవాదాలు, దాన్ని నేను మిస్ అవుతున్నాను. సెప్టెంబ‌ర్ 27న కొరటాల శివ తీసుకెళ్లే అద్భుత ప్రపంచంలోకి వెళ్లడానికి ప్రేక్షకులతో పాటుగా నేను కూడా వేచి ఉండలేకపోతున్నాను అంటూ ఎన్టీఆర్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది.

స్వ‌యంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక మూవీ రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. ఇప్ప‌టికే ‘దేవర’ నుంచి ఇటీవల ‘చుట్టమల్లే’ విడుద‌ల చేయ‌గా, దానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. వారం లోపే 53 మిలియన్ వ్యూస్ దాటేసింది. అంతకుముందు వచ్చిన ‘ఫియర్ సాంగ్’ 47 మిలియన్లతో యూట్యూబ్​ను షేక్ చేసింది. ‘దేవర’ నుంచి వచ్చిన ప్రతి సాంగ్​కు ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది. ‘దేవర’ నుంచి వచ్చిన పాటలతో పాటు టీజర్​లో బీజీఎం సౌండ్​తో కూడా అద‌ర‌గొట్టాడు అనిరుధ్. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో ఒక్క హిట్ కూడా ద‌క్కించుకోని అనిరుధ్ ఈ సినిమాతో హిట్ కొట్ట‌డం ప‌క్కా అని ముచ్చ‌టించుకుంటున్నారు.

ఇక ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా దేవర. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27 రిలీజ్ కాబోతుంది.రెండో పార్ట్ వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఇక దేవ‌ర షూటింగ్ పూర్తి కావ‌డంతో ఎన్టీఆర్.. వార్ 2 అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొన‌నున్నాడు. ఈ మూవీ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ చేయ‌నున్నాడు. ఈ సినిమా భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొంద‌నుంది. ఇటీవ‌లే ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న విషయం తెలిసిందే.

Exit mobile version