- 20 కొత్త సినిమాలు.. 15 ప్రత్యేకం.. తెలుగులో 10 ఇంట్రెస్టింగ్
- మీ వాచ్‌లిస్ట్ సిద్ధం చేసుకోండి!
OTT Movies | సినిమా ప్రేమికుల కోసం ఈ వారం ఓటీటీ వేదికపై రచ్చ రసంగా మారబోతోంది. జూన్ 30 నుంచి జూలై 6 మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమాస్, సన్ నెక్ట్స్, సోనీలివ్, జీ5, ఈటీవీ విన్ వంటి ప్రముఖ డిజిటల్ వేదికలపై ఏకంగా 20 కొత్త సినిమాలు/సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి.
వీటిలో 15 సినిమాలు ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఉండగా, తెలుగు భాషలో 10 సినిమాలు/సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. హారర్, యాక్షన్, కోర్ట్‌రూమ్ డ్రామా, సైన్స్ ఫిక్షన్, కామెడీ వంటి విభిన్నమైన జోనర్లలో ఈ చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనున్నాయి.
ఒకవైపు కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, కీర్తి సురేష్ ‘ఉప్పు కప్పురంబు’, ప్రియాంక చోప్రా ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’, ‘ది ఓల్డ్ గార్డ్ 2’, ‘ది హంట్: రాజీవ్ గాంధీ కేసు’ వంటి సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరోవైపు, జగమెరిగిన సత్యం, ఏఐఆర్, మద్రాస్ మ్యాట్నీ, కంపానియన్ లాంటి ఇంట్రెస్టింగ్ కథలతో తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకునే అవకాశముంది.
నెట్‌ఫ్లిక్స్:
- షార్క్ విస్పరర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – జూన్ 30
- అటాక్ ఆన్ లండన్: హంటింగ్ ది 7/7 బాంబర్స్ (డాక్యుమెంటరీ సిరీస్) – జూలై 1
- ది ఓల్డ్ గార్డ్ 2 (తెలుగు డబ్బింగ్ యాక్షన్ థ్రిల్లర్) – జూలై 2
- థగ్ లైఫ్ (తెలుగు/తమిళ యాక్షన్ డ్రామా – రూమర్ డేట్) – జూలై 3
- ది సాండ్‌మ్యాన్ సీజన్ 2 (ఫాంటసీ సూపర్‌హీరో సిరీస్) – జూలై 3
- బిచ్ వర్సెస్ రిచ్ సీజన్ 2 – జూలై 3
- ది సమ్మర్ హికరు డైడ్ (జపనీస్ యానిమేషన్ థ్రిల్లర్) – జూలై 5
అమెజాన్ ప్రైమ్:
- హెడ్స్ ఆఫ్ స్టేట్ (తెలుగు డబ్బింగ్ యాక్షన్ థ్రిల్లర్) – జూలై 2
- మద్రాస్ మ్యాట్నీ (తెలుగు డబ్బింగ్ తమిళ థ్రిల్లర్) – జూలై 3
- ఉప్పు కప్పురంబు (తెలుగు సెటైరికల్ కామెడీ) – జూలై 4
జియో సినిమాస్/హాట్‌స్టార్:
- కంపానియన్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్) – జూన్ 30
- లా అండ్ ది సిటీ (కొరియన్ కోర్ట్ రూమ్ డ్రామా) – జూలై 5
- సన్ నెక్ట్స్:
- మద్రాస్ మ్యాట్నీ (తెలుగు డబ్బింగ్) – జూలై 3
- జగమెరిగిన సత్యం (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్) – జూలై 4
ఈటీవీ విన్:
- ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ (తెలుగు కామెడీ వెబ్‌సిరీస్) – జూలై 3
జీ5:
- కాళీధర్ లపతా (హిందీ క్రైమ్ థ్రిల్లర్) – జూలై 4
సోనీలివ్:
- ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు (తెలుగు డబ్బింగ్ పొలిటికల్ థ్రిల్లర్) – జూలై 4
లయన్స్ గేట్ ప్లే:
- అపోకలిప్టో (తెలుగు డబ్బింగ్ అడ్వెంచర్ థ్రిల్లర్) – జూలై 4
- ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్ (ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్) – జూలై 4
ఈ వారం ఓటీటీలో స్పెషల్ సినిమాలు:
ఈ వారం కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, కీర్తి సురేష్ ‘ఉప్పు కప్పురంబు’, ప్రియాంక చోప్రా ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’, AIR వెబ్ సిరీస్, ‘ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు’, ‘అపోకలిప్టో’ వంటి చిత్రాలు ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతున్నాయి. అంతేకాదు, ది ఓల్డ్ గార్డ్ 2, మద్రాస్ మ్యాట్నీ, జగమెరిగిన సత్యం, సాండ్‌మ్యాన్ 2 వంటి చిత్రాలు కూడా బలమైన కంటెంట్‌తో వస్తున్నాయి.