Site icon vidhaatha

ఆవేదన తో పుట్టిన ప్యానెల్.. ప్రకాష్ రాజ్

శ్రీకాంత్, ఉత్తేజ్, సమీర్, సన, బెనర్జీ, నాగినీడు అనసూయ ఏడిద శ్రీరామ్, ప్రగతి, తనీష్ అజయ్ తదితరులు హాజరు.

విధాత:రెండు మూడు రోజుల నుంచి మీడియా లో వస్తున్న వార్తలను చూసి ఈ ప్రెస్ మీట్ పెట్టాను.నా ప్యానెల్ లో నలుగురు అధ్యక్షులు వున్నారు.నేను తప్పు చేస్తే నా సభ్యులు నన్ను నిలదీస్తారు.లోకల్ నాన్ లోకల్ అంటున్నారు. కళాకారులు యూనివర్సల్ .నేను చేస్తున్న సేవా కార్యక్రమాలప్పుడు నాన్ లోకల్ అని అనలేదు 9నందులు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ కనపడలేదు.ఇప్పుడెందుకు నాన్‌లోకల్‌ తెరమీదకు వచ్చింది.

ఒక ఆవేదన తో పుట్టిన ప్యానెల్ ఇది

‘మా’ భవనం ఎక్కడ ఎలా కడతాం అనేది మీరు అందరూ గర్వ పడేలా కడతాం.ప్రతి రోజు పెద్దలలో మాట్లాడుతున్నాం.పదవి కోసం ఇక్కడకు రాలేదు.నాకు ఇక్కడ అందరూ మిత్రులే.

నాకు ప్రశ్నించే వాళ్ళు కావాలి నిలదీసే వాళ్ళు కావాలి,అలాంటి వాళ్ళే మా ప్యానెల్ సభ్యులు.

ReadMore:లోక‌ల్‌-నాన్ లోక‌ల్ వివాదంపై స్పందించిన ప్రకాష్ రాజ్

Exit mobile version