Site icon vidhaatha

OG : పవన్ పుట్టిన రోజున డబుల్ ధమాకా

OG movie-Pawan Kalyan

విధాత : పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) పుట్టిన రోజు సందర్బంగా ఆయన హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఓజీ’(OG) నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. సుజీత్(Sujeeth) దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ మూవీలో పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. గ్యాంగ్ స్టర్ గా పవన్ సన్నివేశాలతో కూడిన గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. డీవీవీ దానయ్య( DVV Danayya), కల్యాణ్‌ దాసరి(Kalyan Dasari) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌(Priyanka Arul Mohan) కథానాయిక. ఇమ్రాన్‌ హష్మీ ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమా సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరోవైపు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసి స్పెషల్ మ్యాష్‌అప్‌ వీడియో ఆకట్టుకుంటోంది. పవన్ సినీ రాజకీయ ప్రస్థానం..సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు..డైలాగ్ లు..డ్యాన్స్ సన్నివేశాలు..రాజకీయాల్లో పవన్ ప్రయాణం వంటి అంశాలతో రూపొందిన ఈ వీడియో పవన్ జీవితాన్ని కళ్లకు కట్టింది. ‘ఈశ్వరా.. పవనేశ్వరా..’ అంటూ ప్రారంభమైన ఈ వీడియోలో పవన్‌ ఎమోషనల్‌ డైలాగ్ లు.. ఆయన స్పీచ్‌లు అభిమానులను ఉర్రూతలూగించేలా సాగాయి.

Exit mobile version