Site icon vidhaatha

Ustaad Bhagat Singh : పవన్ అభిమానులకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పోస్టర్ జోష్

Pawan Kalyan-Ustaad Bhagath Singh

విధాత: రేపు జరిగే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పుట్టిన రోజు వేడుకకు ఒక రోజు ముందుగానే ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ నుంచి మేకర్స్ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్‌లోని స్టిల్‌లో పవన్ కళ్యాణ్ వెనుక పెద్ద గడియారం కనిపిస్తుంది. తలమీద హాట్ ధరించి డ్యాన్స్ స్టెప్ స్టిల్ తో పవర్ స్టార్ పోస్టర్ పవన్ అభిమానుల్లో ఉత్సాహం రేపింది. హ్యాపీ బర్త్‌డే పవర్ స్టార్ అనే వాక్యంతో ఈ గడియారం బ్యాక్ గ్రౌండ్ పోస్టర్ పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ గా మారింది.

పవన్ కళ్యాణ్ హీరోగా, హరీశ్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలున్నాయి. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి మైత్రి మూవీ(Mythri Movies) బ్యానర్‌లో సినిమా నిర్మాణం జరుపుకుంటుంది. సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ సెప్టెంబర్ 6న తిరిగి ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ తెలిపింది.

Exit mobile version