విధాత:పవన్ కళ్యాణ్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీ 3.0 మోడల్ కారును బుక్ చేసినట్లు తెలుస్తోంది. దీని ఖరీదు రూ. 4 కోట్ల రూపాయలు ఉంటుందని టాక్. కొద్దిమంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉండే ఈ రేంజ్‌రోవర్ కారు దేశంలోనే అంత్యంత విలువైనది. 4 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ మోడల్‌ను పవన్ తన పేరు మీద బుక్ చేసినట్లు ఫిల్మ్‌నగర్ వార్త. ఇటూ సినిమాలు అటూ రాజకీయాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో దూర ప్రయాణాలకు సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఖరీదైన కారును కొనుగోలు చేస్తున్నారని పీకే అభిమానులు చెబుతున్నారు.