Pawan Kalyan| పిఠాపురంలో పోటీ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంగ‌ళ‌గిరిలో ఓటు వేయ‌డం ఏంటి?

Pawan Kalyan| జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సారి పిఠాపురంలో పోటీ చేసిన విష‌యం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వంగా గీతాపై ఆయన పోటీ చేయ‌గా, ఆమెపై గెల‌వ‌డం ఖాయం అని జ‌న‌సేన వ‌ర్గాలు భావిస్తున్నాయి. ప‌వన్ కోసం చాలా మంది సెల‌బ్రిటీలు పిఠాపురానికి వ‌

  • Publish Date - May 13, 2024 / 09:58 AM IST

Pawan Kalyan| జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సారి పిఠాపురంలో పోటీ చేసిన విష‌యం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వంగా గీతాపై ఆయన పోటీ చేయ‌గా, ఆమెపై గెల‌వ‌డం ఖాయం అని జ‌న‌సేన వ‌ర్గాలు భావిస్తున్నాయి. ప‌వన్ కోసం చాలా మంది సెల‌బ్రిటీలు పిఠాపురానికి వ‌చ్చి ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారాలు చేశారు. ఇంకొంద‌రు సోష‌ల్ మీడియా ద్వారా ప‌వ‌న్‌కి మ‌ద్ద‌తు తెలిపారు. అయితే ఈ రోజు పోలింగ్ డే కావ‌డంతో ఏపీలో ఓట‌ర్లంద‌రు వెళ్లి త‌మ‌కు న‌చ్చిన వారికి ఓటేస్తున్నారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న స‌తీమ‌ణి అన్నా లెజినోవాని తీసుకొని వెళ్లి ఓటు వేశారు.

అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుండ‌గా, మంగ‌ళ‌గిరిలో ఓటు వేయ‌డానికి కార‌ణం ఏంటంటే, ఆయ‌నకు పిఠాపురంలో ఓటు హ‌క్కు లేదు. అందుకే మంగ‌ళ‌గిరిలో ఓటు వేశారు. ప‌వ‌న్ వ‌చ్చిన స‌మ‌యంలో క్యూ లైన్‌లో చాలా మంది ఓటర్స్ ఉండ‌గా, వారితో పాటు క్యూ లైన్‌లో నిలుచుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న వంతు వ‌చ్చిన‌ప్పుడు బూత్ లోప‌లికి వెళ్లి ఓటు వేసి వ‌చ్చారు. అందుకు సంబందించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతితో కలిసి కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భాకరాపురంకి వెళ్లి ఓటు వేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య భువనేశ్వరితో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి కొద్దిసేపు క్యూలో నిల్చుని ఓటు వేశారు. ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్, ఆయన భార్య భువనేశ్వరితో కలిసి మంగళగిరి నియోజకవర్గంలో ఓటు వేశారు.

Latest News