Site icon vidhaatha

Allu Arjun|అల్లు అర్జున్‌ని డైరెక్ట్ చేద్దామ‌నుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అస‌లు ఈ సినిమా ఎలా మిస్ అయింద‌బ్బా..!

Allu Arjun| ఏపీ ఎన్నిక‌లు మెగా, అల్లు కుటుంబాల మ‌ధ్య చిచ్చు పెట్టడం మనం చూశాం. పవన్ ప్ర‌తిప‌క్ష పార్టీకి అల్లు అర్జున్ మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో పాటు స్వ‌యంగా అక్క‌డికి వెళ్ల‌డంతో మెగా కుటుంబం అంతా బ‌న్నీపై కోపంగా ఉంది.నాగ‌బాబు, తేజ్ అయితే డైరెక్ట్‌గానే రియాక్ష‌న్ చూపించారు. ఇక తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి కూడా మ‌న‌సులో బ‌న్నీపై కోపం ఉంద‌ని, అందుకే ఇటీవ‌ల ఆయ‌న నోటి నుండి బ‌న్నీకి నెగెటివ్‌గా కామెంట్స్ వ‌చ్చాయ‌ని కొందరు చెప్పుకొచ్చారు. వన్య ప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చించేందుకు పొరుగు రాష్ట్రం కర్ణాటక ప్రభుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపిన ప‌వ‌న్.. చర్చల అంశాలను వివరిస్తూనే కీలక వ్యాఖ్యలు చేశారు.

40 ఏళ్ల కిందట సినిమాలో హీరోలు అడవులను కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం మన సినిమా పరిస్థితి’ అంటూ ప‌వ‌న్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు . ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడ సాధారణమే అనిపించిన‌ప్ప‌టికీ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ నడిచింది. పవన్‌ కల్యాణ్‌ పరోక్షంగా తన అల్లుడు అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ సినిమాల గురించే మాట్లాడారని చర్చించుకుంటున్నారు. దీనిని జ‌న‌సేన నాయ‌కులు ఖండించారు.ఇదిలా ఉండగా,. అల్లు అర్జున్ హీరోగా..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో ఓ సినిమా కూడా చేయాలని అనుకున్నారట. అన్ని రెడీ చేసుకున్నా కూడా చివ‌రికి అది మిస్ అయింది.

బన్నీని పవన్ కళ్యాన్ డైరెక్షన్ లోనే లాంచ్ చేయాలి అని నిర్మాత‌ అల్లు అరవింద్ అనుకున్నారట. అల్లు అర్జున్ ని టాలీవుడ్ లో లాంచ్ చేయడం కోసం ఎన్నో క‌థ‌లు విన్నా కూడా ఓపట్టాన ఏ కథ నచ్చలేదట. దాంతో పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన ఓ స్టోరీ ఆయనకు గుర్తుకు వచ్చిందట. దాంతో పవన్ ను కలిసి ఆ కథతో అల్లు అర్జున్ ను లాంచ్ చేద్దాం అని అనుకోగా, దానికి ప‌వన్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌.కాక‌పోతే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదని సమాచారం. కాగా మ‌ల్టీ టాలెంటెడ్ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. జానీ సినిమాని తెర‌కెక్కించాడు. గుడుంబ శంకర్ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా రాశారు . సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాకు కూడా ఆయన కథ, స్క్రీన్ ప్లే అందించారు.

Exit mobile version