Site icon vidhaatha

Pawan Kalyan| డిప్యూటీ సీఎం త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ‌స్ట్ ఇన్‌స్టా పోస్ట్ ఏంటంటే..!

Pawan Kalyan| సినిమాలో టాప్ హీరోగా ఉన్న‌త స్థానంలో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు రాజ‌కీయాల‌లో కూడా మ‌రింత ఎత్తుకి ఎద‌గాల‌ని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించి త‌న స‌త్తా ఏంటో చూపించారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్‏కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి అండ్ గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర & సాంకేతిక శాఖలు కేటాయించారు.

అయితే బుధ‌వారం రోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ విజయవాడలోని డీప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పోలీసుల గౌర‌వ వందనం స్వీక‌రించి ఆ త‌ర్వాత ప‌లు పూజ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు ఫైళ్ల‌పై కూడా సంత‌కాలు చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఇలా చూడ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని ప‌లువురు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తున్నారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌డం చాల త‌క్కువ. అప్పుడప్పుడు ట్విట్ట‌ర్‌లో మాత్రమే రాజ‌కీయాల‌కి సంబంధించిన ఆస‌క్తిక‌ర పోస్ట్‌లు పెడుతుంటారు. అయితే కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టా ఓపెన్ చేసిన ప‌వ‌న్ అందులో ఎక్కువ‌గా యాక్టివ్‌గా ఉండ‌రు.

డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ తన ఇన్ స్టాలో ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. అందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి తన ఛాంబర్ వరకు రావడం, పూజలు నిర్వహించడం, ఫైల్స్ మీద సంతకాలు చేయడం, పలువురు అధికారులను కలవడం , త‌న పార్టీ నాయ‌కుల‌ని ప్రేమ‌తో ఆలింగ‌నం చేసుకోవ‌డం వంటివి ఆ వీడియోలో క‌నిపిస్తున్నాయి. ఇక ఈ వీడియోకి ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా జ‌త చేశారు. “ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర & సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. ఇప్పుడు నా బాధ్య‌త మ‌రింత పెరిగింది. ఎంతో బాధ్య‌త‌తో రాష్ట్రం కోసం ప‌ని చేస్తాను. ప్ర‌తి ఒక్క‌రి భ‌విష్య‌త్ కోసం ప‌ని చేయ‌డానికి నేను ఎదురు చూస్తున్నాను అని ప‌వ‌న్ త‌న పోస్ట్‌లో తెలిపారు.

Exit mobile version