Pawan Kalyan| ఎల‌క్షన్స్ పూర్తి.. మ‌రి పెండింగ్‌లో ఉన్న సినిమాలని ప‌వ‌న్ పూర్తి చేస్తాడా..!

Pawan Kalyan|  ప‌వర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌లోను యాక్టివ్‌గా ఉన్నారు. ఈ సారి ఆయ‌న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేయ‌గా, ఆయ‌న భారీ మెజారిటీతో గెలుస్తాడ‌ని చాలా మంది చెబుతున్న మాట‌. ప‌వ‌న్‌కి ఈ సారి భారీగా మ‌ద్ద‌తు ల‌భించ‌డం, ఇండ‌స్ట్రీ నుండి అనేక మంది ప్ర‌ముఖులు పిఠాపురానికి వ‌చ్చి ఆయ‌న త‌ర‌పున ప్ర‌చారం చేయ‌డం మ‌నం చూశాం. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా చాలా కాలంగా సి

  • Publish Date - May 15, 2024 / 09:25 AM IST

Pawan Kalyan|  ప‌వర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌లోను యాక్టివ్‌గా ఉన్నారు. ఈ సారి ఆయ‌న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేయ‌గా, ఆయ‌న భారీ మెజారిటీతో గెలుస్తాడ‌ని చాలా మంది చెబుతున్న మాట‌. ప‌వ‌న్‌కి ఈ సారి భారీగా మ‌ద్ద‌తు ల‌భించ‌డం, ఇండ‌స్ట్రీ నుండి అనేక మంది ప్ర‌ముఖులు పిఠాపురానికి వ‌చ్చి ఆయ‌న త‌ర‌పున ప్ర‌చారం చేయ‌డం మ‌నం చూశాం. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా చాలా కాలంగా సినిమాలు ప‌క్క‌న పెట్టి త‌న పూర్తి స‌మ‌యాన్ని రాజ‌కీయాల‌కే కేటాయించాడు. అయితే ప్ర‌స్తుతం ఎల‌క్షన్స్ పూర్త‌య్యాయి. రిజ‌ల్ట్ రావ‌డానికి మ‌రో 20 రోజుల స‌మయం ఉంది.

ఇక ప‌వ‌న్ క‌మిటైన చాలా సినిమాలు పెండింగ్‌లో ఉన్నాయి. వారిని ఇప్పుడు ప‌వ‌న్ పూర్తి చేస్తాడా, ఏ సినిమా షూటింగ్‌లో ముందు పాల్గొంటాడు అనేది చ‌ర్చ‌నీయాంశం అయింది. అందరి ఫోకస్ ఎక్కువగా OG సినిమా పైనే ఉండ‌గా, ఈ మూవీ షూటింగ్ స‌గానికి పైగా పూర్త‌యిన‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ మూవీని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి ఆ త‌ర్వాత మిగ‌తా మూవీ షూటింగ్స్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొన‌బోతున్న‌ట్టుగా తెలుస్తుంది. అయితే గ‌త కొద్ది నెల‌లుగా రాజ‌కీయ యాత్ర‌ల‌తో బాగా అలిసిపోయిన ప‌వ‌న్ కాస్త విశ్రాంతి కోరుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే విహార యాత్ర‌ల‌కి కూడా వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది.

విహార యాత్ర‌ల నుండి తిరిగి వ‌చ్చాక పూర్తి స‌మ‌యాన్ని సినిమాలపై పెట్ట‌నున్నాడు. లిస్టులో హరిహర వీరమల్లు సినిమా ఉండ‌గా, ఈ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ 30 శాతం ఉన్న‌ట్టు తెలుస్తుంది. క్రిష్ మూవీ నుండి త‌ప్పుకోవ‌డంతో జ్యోతికృష్ణ వ‌చ్చి చేరాడు. ఆయ‌న కూడా వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని అనుకుంటున్నాడు. ఇక హ‌రీష్ శంక‌ర్ మూవీ షూటింగ్ కూడా బ్యాలెన్స్ ఉంది. వీట‌న్నింటిని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసే అవ‌కాశం ఉంది.

Latest News