Site icon vidhaatha

Pawan Kalyan| చాలా రోజుల త‌ర్వాత స్టైలిష్ లుక్‌లో క‌నిపించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. భార్య‌తో ఎయిర్‌పోర్ట్‌లో ప్ర‌త్య‌క్షం

Pawan Kalyan| ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాక త‌న గెట‌ప్ పూర్తిగా మార్చేయ‌డం మ‌నం చూశాం. కేవ‌లం తెల్ల దుస్తుల‌లో మాత్ర‌మే క‌నిపిస్తున్నారు. సినిమా ఫంక్ష‌న్స్ స‌మ‌యంలో కూడా ఆయ‌న తెల్ల దుస్తుల్లోనే ప‌లుమార్లు వ‌చ్చారు. ఇక ఇటీవ‌ల ప‌వన్ క‌ళ్యాణ్ వారాహి అమ్మ‌వారి దీక్ష చేప‌ట్టారు.గత నెల 26న పవన్ అమ్మవారి వారాహి దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు ప‌వ‌న్ ఈ దీక్ష తీసుకున్నారు. ఆ స‌మ‌య‌లో ఆయ‌న కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకున్నారు. వెన్ను నొప్పి తీవ్రంగా ఇబ్బంది పెట్టిన‌ప్ప‌టికీ పట్టుదలతో ఆ దీక్షను పూర్తి చేశారు. 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో పవన్ ఈ దీక్ష చేపట్టిన విష‌యం విదిత‌మే.

అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి అమ్మ‌వారి దీక్ష చేప‌ట్టిన స‌మ‌యంలో ఆయ‌న చెప్పులు వేసుకొని క‌నిపించారు. దీనిపై వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. పవన్ కల్యాణ్ చెప్పులు ధరించి దీక్ష చేయడం హిందువులను కించ పరచడమంటూ ప‌లువురు కామెంట్స్ చేశారు. అయితే దీనిపై ప‌వ‌న్ స్పందించింది లేదు. క‌ట్ చేస్తే ప‌వన్ క‌ళ్యాణ్ తాజాగా త‌న భార్య‌తో క‌లిసి హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మెరిసారు. తెలుపు దుస్తుల‌లో కాకుండా బ్లాక్ షర్ట్, బ్రౌన్ క‌ల‌ర్ ప్యాంట్ ధ‌రించి స్వాగ్‌తో చాలా స్టైలిష్‌గా న‌డుస్తూ క‌నిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అయింది.

అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఢిల్లీలో జ‌ర‌గ‌బోయే జలజీవన్ సమావేశంలో పాల్గొనేందుకు అక్క‌డికి వెళ్లార‌ని తెలుస్తుంది.. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి హోదాలో పవన్ హాజరు అవుతున్న‌ట్టు తెలుస్తుంది. తొలిసారి కేంద్ర మంత్రితో సమీక్షకు హాజరుకానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లువురు ప్ర‌ముఖులతో కూడా భేటి కానున్న‌ట్టు స‌మాచారం.

Exit mobile version