Pawan Kalyan| ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే నేను.. ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాత ఆస‌క్తిక‌ర సీన్

Pawan Kalyan| కొద్ది సేప‌టి క్రితం కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ మంత్రిగా పవన్ తన ప్రమా

  • Publish Date - June 12, 2024 / 12:45 PM IST

Pawan Kalyan| కొద్ది సేప‌టి క్రితం కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ మంత్రిగా పవన్ తన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. పవన్‌తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన స‌మ‌యంలో స‌భా ప్రాంగ‌ణం మొత్తం ద‌ద్ద‌రిల్లింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపై ఆశీనులైన అతిథులందరికీ నమస్కరించారు. ఇక తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించడం ఆసక్తికరంగా అనిపించింది. పవన్‌ను చిరు ప్రేమగా ద‌గ్గ‌ర‌గా తీసుకొని హ‌త్తుకున్నారు.

పవన్ కళ్యాణ్ మైక్ ముందుకు రాగానే జనం హోరెత్తి జేజేలు పలికారు. సభా ప్రాంగణం అంతా ఒక్కసారిగా అరుపులతో నిండిపోయింది. ప‌న్ క‌ళ్యాణ్ ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న స‌మయంలో మెగా స్టార్ చిరంజీవి మోహంలో చిరునవ్వు, ఆనందం, సంతోషం అంతా ఇంతా కాదు. చిరంజీవి ఎంతో ఆప్యాయతతో తన తమ్ముడి ప్రమాణస్వీకారం చేస్తున్నంతసేపు భావోద్వేగంతో అలా చూస్తూ ఉండిపోయారు. పవన్ కళ్యాణ్ తన ప్రమాణ స్వీకారం ముగియగానే చంద్రబాబుని, ప్రధాని మోదీని, తరువాత అక్కడకి వచ్చిన ప్రత్యేక అతిధులకు నమస్కారవం చేసుకుంటూ వెళ్లారు.అన్నయ్య చిరంజీవి దగ్గరికి వెళ్లి పాదాభివందంనం చేయ‌డంతో సభాప్రాంగ‌ణం ద‌ద్ద‌రిల్లింది.

ఇదే కాక మోదీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని చిరంజీవి ద‌గ్గ‌ర‌కు తీసుకు వెళ్లి ఇద్ద‌రితో క‌లిసి తెలుగు ప్ర‌జ‌ల‌కి అభివాదం చేశారు. మెగా బ్ర‌ద‌ర్స్‌తో మోదీ చాలా సంతోషంగా క‌నిపించారు. ఆ స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ కూడా చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. అస‌లు ఈ సీన్ అదుర్స్ అంటూ వారి ముగ్గురికి సంబంధించిన ఫొటోల‌ని, వీడియోల‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. ఇక మోదీ.. ర‌జ‌నీకాంత్‌ని, బాలయ్యని కూడా ప‌ల‌కరిస్తూ వారికి అభివాదం చేశారు.

Latest News