Pawan Kalyan| పిఠాపురం ఎమ్మేల్యే తాలూకా అనే బోర్డ్‌ల‌పై తొలిసారి స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Pawan Kalyan| ఈ సారి ఎన్నిక‌ల‌లో పిఠాపురం నుండి పోటీ చేసి బంప‌ర్ మెజారిటీతో గెలిచిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అసెంబ్లీలో ప‌వన్ కళ్యాణ్ అనే నేనూ అంటూ ప్ర‌మాణం చేయ‌డం మ‌నం చూశాం. అయితే ఆ స‌మ‌యం కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎంతో ఆశ‌గా ఎదురు చూశారు. ప‌వ‌న్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వం వీడియో

  • Publish Date - July 4, 2024 / 07:00 AM IST

Pawan Kalyan| ఈ సారి ఎన్నిక‌ల‌లో పిఠాపురం నుండి పోటీ చేసి బంప‌ర్ మెజారిటీతో గెలిచిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అసెంబ్లీలో ప‌వన్ కళ్యాణ్ అనే నేనూ అంటూ ప్ర‌మాణం చేయ‌డం మ‌నం చూశాం. అయితే ఆ స‌మ‌యం కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎంతో ఆశ‌గా ఎదురు చూశారు. ప‌వ‌న్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వం వీడియోలు నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. అయితే త‌న‌ని బంపర్ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ఓటర్లకు ధన్యవాదాలు తెలియ‌జేసేందుకు ప‌వ‌న్ డిప్యూటీ సీఎం హోదాలో పిఠాపురంలో అడుగుపెట్టారు. అక్కడ బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ త‌న‌ని బంపర్ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు..ఇక ఈ సంద‌ర్భంలో అభిమానులు OG.. OG అంటూ అరిచారు. దాంతో పవన్ కళ్యాణ్ తన అప్ కమింగ్ సినిమాలపై క్లారిటీ ఇచ్చారు.

ఓజీనా.. సినిమాలు చేసే టైమ్ నాకు ఉందంటారా? ఎలాగూ మాట ఇచ్చాం కాబట్టి.. ముందు ఒక మూడు నెలలు మీకోసం ప‌ని చేస్తాను. కనీసం రోడ్డుకు గుంతలు కూడా పూడ్చలేదు అని తిట్టుకోకూడదు కదా. గ్రామాలకు కొత్త రోడ్లు కంటే ముందు ఉన్న గుంతలైనా పూడ్చాలి. మళ్లీ నన్ను తిట్టుకోకూడదు కదా.. మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు వెళ్లి ఓజీ ఓజీ ఏంటి అని క్యాజీ అంటే నేనేం చెప్పను. ఆ భయంతోనే.. నిర్మాతలకు కూడా చెప్పాను. కాస్త నన్ను క్షమించాలి అని. మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాస్త సేవ చేసుకుని.. కుదిరినప్పుడల్లా ఒక రెండు రోజులో, మూడు రోజులో షూటింగ్ చేస్తాను.. ఎక్కడా పనికి అంతరాయం రాకుండా అని చెప్పాను. ఓజీ చూద్దురుగానీ.. బాగుంటుంది’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఇక పిఠాపురం తాలూకా అని చెప్పి నాకు చెడ్డపేరు తీసుకుని రావొద్దు అని ప‌వ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. పోలీస్ అధికారులు, ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్‌లు ఏదంటే.. పిఠాపురం తాలూకా అంటే నన్ను తిడతారు. కొడతారు. మీరు రాంగ్‌వేలో వెళ్తూ.. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే బాగుండ‌దు కదా.. ముందు మనం నిబంధనల్ని పాటించాలి. అందరూ చట్టాలను గౌరవించాలి. ముందు మీరు రూల్స్ పాటించండి. మీకు కావాలంటే నాకు ఇక్కడ రెండెకరాల పొలం ఉంది. అక్కడికి వచ్చి.. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా అని బైక్‌లు వేసుకుని వచ్చి తిరగండి. మీకోసం అక్కడ బైక్ రేస్‌లు పెడతాను. మీకు దెబ్బలు తగలకుండా హెల్మెట్‌లు అవ‌న్నీ ధ‌రించుకొని రండి. నేను భవిష్యత్ తరాలకోసం పనిచేస్తున్నా అని చెప్పుకొచ్చారు.

Latest News