Pawan Kalyan| వారాహి దీక్ష చేప‌ట్టి చెప్పులు వేసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. శ్రీరెడ్డి సెన్సేష‌న‌ల్ కామెంట్స్

Pawan Kalyan| డిప్యూటీ సీఎంగా ప‌దవి చేప‌ట్టిన త‌ర్వాత పవ‌న్ క‌ళ్యాణ్ చేసే ప్ర‌తి ప‌ని కూడా చర్చ‌నీయాంశంగా మారుతుంది. ఆయ‌న ఈ ఎన్నిక‌ల‌లో అఖండ మెజారిటీతో గెల‌వ‌డంతో తాజాగా వారాహి అమ్మ‌వారి దీక్ష తీసుకున్నారు. జూన్‌ 26 నుంచి 11 రోజుల పాటు పవన్‌ వారాహి మాత దీక్షలో ఉండబోతు

  • Publish Date - June 26, 2024 / 02:15 PM IST

Pawan Kalyan| డిప్యూటీ సీఎంగా ప‌దవి చేప‌ట్టిన త‌ర్వాత పవ‌న్ క‌ళ్యాణ్ చేసే ప్ర‌తి ప‌ని కూడా చర్చ‌నీయాంశంగా మారుతుంది. ఆయ‌న ఈ ఎన్నిక‌ల‌లో అఖండ మెజారిటీతో గెల‌వ‌డంతో తాజాగా వారాహి అమ్మ‌వారి దీక్ష తీసుకున్నారు. జూన్‌ 26 నుంచి 11 రోజుల పాటు పవన్‌ వారాహి మాత దీక్షలో ఉండబోతున్నారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దీక్షలో భాగంగా 11 రోజుల పాటు పవన్‌ కల్యాణ్‌ కేవలం పాలు, పండ్లు, ఇతర ద్రవరూప ఆహారం మాత్రమే తీసుకుంటార‌ని తెలుస్తుంది. గ‌త ఏడాది జూన్‌లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ వారాహి అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి వారాహి విజ‌య యాత్ర చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

. గతేడాది కూడా జూన్‌ నెలలో పవన్‌ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంగా వారాహి అమ్మకు పూజలు నిర్వహించారు. అప్పట్లో కూడా వారాహి మాత వార్తల్లో నిలిచారు. కాకపోతే ఈ సారి డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌ దీక్ష చేపడుతుండటం విశేషంగా మారింది. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ దీక్షలో భాగంగా కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. అయితే వారాహి దీక్ష తీసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు.ఎంతో ప‌ద్ద‌తిగా బొట్టు పెట్టుకొని, ప‌సుపు రంగులు ధ‌రించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని చూసి అంద‌రు మురిసిపోతున్నారు.

అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాల ధరించి చెప్పులు వేసుకోవ‌డం ఇప్పుడు ప్ర‌తి ఒక్కరు షాక్ అయ్యేలా చేసింది. మొద‌టి నుండి ప‌వ‌న్‌ని విమ‌ర్శిస్తూ ఉండే శ్రీరెడ్డి తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పులు ధ‌రించిన ఫొటోలు షేర్ చేస్తూ…బీజేపీని మెప్పించ‌డానికా? చెప్పుల‌తో దీక్ష‌లు.. వాట్ ఏ హిందూ ఫాలోవర్ అంటూ రెండు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వే బొమ్మ‌ల‌ని జ‌త చేసింది.ప్ర‌స్తుతం శ్రీరెడ్డి షేర్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. గతంలో పవన్‌ చాలా దీక్షలు చేపట్టడం మనం చూశాం. చాతుర్మాస దీక్షని నాలుగు నెలల పాటు ప‌వ‌న్ చేశారు. ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం మాసాల్లో పవన్‌ దీక్ష చేపట్టారు. ఆ దీక్షలో కూడా ఆహార నియమాలు పాటించారు. సాత్వికాహారం మాత్రమే తీసుకునేవారు. దీక్ష విరమించే సమయంలో హోమం కూడా నిర్వహించారు

Latest News