Akira Nandan| త‌మ్ముడు రీరిలీజ్.. సంద‌డి అంతా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌యుడిదే..!

Akira Nandan| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎంత మారు మ్రోగిపోతుందో మ‌నం చూస్తున్నాం. ఇన్నాళ్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని హీరోగా అంద‌రు ఇష్ట‌ప‌డ్డారు. ఇప్పుడు రాజ‌కీయ‌న నాయ‌కుడిగా కూడా అభిమానిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్

  • Publish Date - June 16, 2024 / 06:15 AM IST

Akira Nandan| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎంత మారు మ్రోగిపోతుందో మ‌నం చూస్తున్నాం. ఇన్నాళ్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని హీరోగా అంద‌రు ఇష్ట‌ప‌డ్డారు. ఇప్పుడు రాజ‌కీయ‌న నాయ‌కుడిగా కూడా అభిమానిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్ కు అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఘ‌న‌మైన విజయం సాధించి ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న‌త ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. ఇక ప‌వ‌న్ క‌ళ్య‌ణ్ అసెంబ్లీలో అడుగుపెట్ట‌డంటూ ఎంద‌రో విమ‌ర్శ‌లు చేశారు. వాట‌న్నింటిని ప‌క్క‌కి పెట్టి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్.

ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు రాజ‌కీయాల‌తో చాలా బిజీగా ఉండ‌నున్నాడు. మ‌రి సినిమాలు చేస్తాడా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందం మ‌రింత రెట్టింపు చేసేందుకు తమ్ముడు సినిమా రీ రిలీజ్ చేసారు.. తమ్ముడు సినిమా 15 జులై 1999 లో రిలీజయి భారీ విజయం సాధించింది. ఈ సినిమా రిలీజయి 25 ఏళ్ళు అవుతుండటంతో మళ్ళీ అదే డేట్ కి తమ్ముడు సినిమా రీ రిలీజ్ చేసారు. చిత్రంలో పవన్ కళ్యాణ్, ప్రీతీ జింగానియ జంటగా అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఒక అన్నయ్య కోరిక నెరవేర్చడానికి అల్లరిచిల్లరగా తిరిగే తమ్ముడు ఎలా కష్టపడ్డాడు అనే కథాంశంతో మూవీ రూపొంది మంచి హిట్ కొట్టింది. చిత్రంలోని సాంగ్స్ సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించాయి.

త‌మ్ముడు రీరిలీజ్ కావ‌డంతో ప‌లు థియేట‌ర్స్‌లో సంద‌డి నెల‌కొంది. పవన్ కళ్యాణ్ మొదటి కుమారుడు అకిరా నందన్ హైదరాబాద్‌లో తన తండ్రి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని చూడటానికి థియేటర్ లో సంద‌డి చేయ‌డంతో అభిమానుల‌లో మ‌రింత జోష్ క‌నిపించింది. సుదర్శన్ థియేటర్లో తమ్ముడు రీ రిలీజ్ స్పెషల్ షోకు వ‌చ్చిన అకీరాని అభిమానులు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశారు. గతంలోనూ చాలాసార్లు వచ్చాడు కానీ ఇలా అభిమానుల మధ్య చిక్కుకుపోవడం ఎప్పుడూ జరగలేదు.ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Latest News