Site icon vidhaatha

Heroine Dasari Sahithi | లోక్‌సభ ఎన్నికల బరిలో తెలుగు హీరోయిన్‌..! నామినేషన్‌ దాఖలు చేసిన ‘పొలిమేర’ హీరోయిన్‌

Heroine Dasari Sahithi | తెలుగు నటి దాసరి సాహితి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్‌ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా నామినేషన్‌ సైతం దాఖలు చేశారు. దాసరి సాహితి పొలిమేర, పొలిమేర-2 సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నది. హీరోయిన్‌గా పలు ఛాన్సులు దక్కించుకుంటున్నది. పొలిమేర-2 చిత్రంలో గెటప్ శ్రీను భార్య రాములు పాత్రలో మెరిసింది. అదే సినిమా సీక్వెల్‌లో సత్యం రాజేశ్‌ను ప్రేమించిన యువతిగా అద్భుతమైన నటనతో అందరి దృష్టి ఆకర్షించింది. తాజాగా నటి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. ఇందులో భాగంగా బుధవారం చేవేళ్లె పార్లమెంట్‌ స్థానానికి నామినేషన్ వేసింది. కలెక్టర్ శశాంక్‌కు సాహితి నామినేషన్‌ సమర్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక చేవెళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌, బీజేపీ తరఫున కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రంజిత్‌రెడ్డి బిలో ఉన్నారు.

Exit mobile version