Kalki 2898 AD| ప్ర‌భాస్ ఈజ్ బ్యాక్.. మైండ్ బ్లోయింగ్‌గా ఉన్న ట్రైల‌ర్..!

Kalki 2898ad| స‌లార్ చిత్రంతో మంచి హిట్ అందుకున్న ప్ర‌భాస్ ప్ర‌స్తుతం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో క‌ల్కి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. జూన్ 27న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్యక్ర‌మాలు జోరుగా సాగుతున్నాయి. ప్ర

  • Publish Date - June 10, 2024 / 08:11 PM IST

Kalki 2898ad| స‌లార్ చిత్రంతో మంచి హిట్ అందుకున్న ప్ర‌భాస్ ప్ర‌స్తుతం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో క‌ల్కి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. జూన్ 27న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్యక్ర‌మాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభాస్ హీరోగా ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్, ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ గా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమలహాసన్ వంటి స్టార్టు, దీపికా పదుకొనె, దిశా పటానీ వంటి హీరోయిన్లు నటించడంతో ఈ సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

మహాభారతం సమయం నుంచి కలియుగంలో కల్కి అవతరించే వరకు ఈ కథ ఉంటుందని తెలుస్తుండ‌గా, మూవీకి సంబంధించిన ట్రైల‌ర్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌లైంది. క‌ళ్లు చెదిరే విజవల్స్ తో కనీవినీ ఎరుగని విధంగా ఉన్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పినట్లుగానే సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి మోడ్రన్ యుద్ధంతో వావ్ అనిపించాడు. భారీ ఆయుధాలు, మెషీన్స్ అబ్బురపరుస్తున్నాయి. రికార్డ్స్ చూసుకో ఇంత వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు.. ఇది కూడా ఓడిపోను అంటూ ప్రభాస్ చెబుతున్న డైలాగ్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. రాజేంద్ర ప్రసాద్ డైలాగులతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. భూమ్మీద మొదటి నగరం.. చివరి నగరం కాశీ అంటూ ట్రైలర్ మొద‌లు కాగా , రాజేంద్ర ప్రసాద్ తో ఒక చిన్న బాలుడు మాట్లాడుతుంటాడు.

భూమి మీద తాగడానికి నీళ్లు కూడా లేని స్థితి కనిపిస్తుంది. భూమిని మొత్తం పీల్చేస్తే మొత్తం ఆకాశంలోనే ఉంటుంది అంటూ రాజేంద్ర ప్రసాద్ జరుగుతున్న ఉపద్రవాలని వివరిస్తాడు. ఆరువేల సంవత్సారాల క్రితం కనిపించిన శక్తి మళ్ళీ రాబోతున్నట్లు రాజేంద్ర ప్రసాద్ ఒక వ్యక్తిని చెబుతుంటాడు. ఇక వెలుగు వచ్చే సమయం అయింది అని అంటాడు. ఆ తర్వాత దీపికా పదుకొనె పాత్ర పరిచయం ఉంటుంది. ఆమె ఓ బిడ్డని కనేందుకు రెడీగా ఉంటుంది. కాంప్లెక్స్ అనే ప‌దం ఎక్కువ‌గా వినిపిస్తుండ‌గా, ప్ర‌భాస్ దాని గురించి క‌ల‌లు కంటుండ‌డం చూడొచ్చు. ఇప్పటికే బుజ్జి అండ్ భైరవ్ యానిమేటెడ్ సిరీస్లో కల్కి వరల్డ్ ఎలా ఉంటుందో ఒక క్లారిటీ ఇవ్వ‌గా, ఇప్పుడు కథ పరంగా కూడా కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. హాలీవుడ్ రేంజ్‌లో ట్రైల‌ర్ ఉంద‌ని చెబుతున్నారు.

Latest News