Prabhas| ప్ర‌భాస్ క‌ల్కి రిలీజ్‌కి టైం ఫిక్స్… కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

Prabhas| యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా దుమ్ము రేపుతున్నాడు.ఆయ‌న సినిమాల కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కులు ఎంతో

  • Publish Date - April 27, 2024 / 09:00 AM IST

Prabhas| యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా దుమ్ము రేపుతున్నాడు.ఆయ‌న సినిమాల కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే చివ‌రిగా ప్రభాస్ స‌లార్ చిత్రంతో పెద్ద హిట్ కొట్ట‌గా, ఇప్పుడు కల్కి 2898ఏడీ` అనే మూవీతో అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ మూవీని నాగ్ అశ్వ‌న్ అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నాడు. మ‌హాన‌టి వంటి సూప‌ర్ హిట్ సినిమాని తీసిన ఈ దర్శకుడు ఇప్పుడు క‌ల్కి మూవీలో ఏంచూపించబోతున్నాడు, ఎలా చూపించబోతున్నాడని అంద‌రిలో అనేక ప్ర‌శ్న‌లు తలెత్తుతున్నాయి. సైన్స్ కి, మైథలాజికల్‌ అంశాలకు ఎలా ముడిపెట్టాడనే దానిపై తెగ ఆలోచిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు మూవీకి సంబంధించి ఎలాంటి క్లూ ఇవ్వ‌లేదు. పాత్ర‌ల‌ని మాత్ర‌మే ప‌రిచ‌యం చేస్తూ వ‌స్తున్నాడు. అయితే నాగ్ అశ్విన్ మాత్రం ఈ సారి గ‌ట్టిగా కొట్టేలా క‌నిపిస్తున్నాడు. అతనికి ఏ సినిమాని ఎలా తీయాలో తెలుసు. నాగ్ అశ్విన్ సినిమాల‌లో పక్కా లాజిక్ కూడా ఉంటుంది. అమితాబ్ గ్లింప్స్ ని ఇటీవ‌ల విడుద‌ల చేయ‌గా, అందులో నాగ్ అశ్విన్ పని తీరుకి మంచి మార్కులు ప‌డ్డాయి. అయితే మే 9న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా మీద వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. ఎన్నికలు, పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ కంప్లీట్‌ కాకపోవడంతో సినిమాని వాయిదా ప‌డుతుంద‌ని అంద‌రు భావిస్తున్నారు. ఇటీవల అమితాబ్ గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు అయిన క్లారిటీ ఇస్తార‌ని అనుకున్నారు. కాని జ‌ర‌గ‌లేదు.

ఈ రోజు(ఏప్రిల్‌ 27) సాయంత్రం ఐదు గంటలకు మూవీ అప్‌ డేట్ రానుంద‌ని ప్ర‌క‌టించారు నిర్మాణ సంస్థ‌. అంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టాలీవుడ్‌ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం మేరకు `కల్కి 2898 ఏడీ` కొత్త డేట్ జూన్‌ 27న ఉంటుంద‌ని టీమ్‌ ఆ డేట్‌ని లాక్ చేసిందని సమాచారం. మొన్నటి వరకు మే 30 లేదంటే జూన్‌ మొదటి వారంలో వ‌స్తుంద‌ని అంద‌రు అనుకున్నారు. కాని జూన్ చివ‌రికి తీసుకెళ్లార‌ని, సాయింత్రం దానిపై పూర్తి క్లారిటీ రానుంది. ఈ మూవీ కోసం డార్లింగ్‌ ఫ్యాన్స్ దాదాపు నాలుగేళ్లుగా వెయిట్‌ చేస్తున్నారు. భారీ క్యాస్టింగ్‌తో మూవీ రూపొందుతుంది. ప్రభాస్, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీతోపాటు యంగ్‌ హీరోలు ముగ్గురు చేస్తుండ‌డంతో అంచ‌నాలు బారీగా ఉన్నాయి.

Latest News