Prabhas| రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్‌కి పాన్ ఇండియా స్టార్ డమ్ దక్కింది. ఇక ఆ తర్వాత నుండి అన్ని భారీ బడ్జెట్ చిత్రాలే చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు. మధ్యలో సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాలతో వరుస ఫ్లాపులు అందుకున్నా ఆ తర్వాత సలార్, కల్కి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇక దీంతో ప్రభాస్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ప్రభాస్ కెరీర్ విషయంలో ఫ్యాన్స్ సంతోషంగానే ఉన్నా ఆయన పర్సనల్ లైఫ్ విషయంలో కొంత ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ 44 సంవత్సరాలు కాగా, ఆయన తోటి నటీనటులు ఇద్దరు, ముగ్గురేసి పిల్లల్ని కూడా కని హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి గురించి ఆలోచన చేయడం లేదు. ఆయన పెళ్లి గురించి నెట్టింట అనేక వార్తలు హల్‌చల్ చేస్తుండగా, అవన్నీ పుకార్లుగానే మిగిలిపోతున్నాయి. అయితే ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోడానికి ఓ కారణం ఉందట. ఈ విషయాన్ని స్టార్ యాంకర్ కమ్ హీరోయిన్ సుమ రీసెంట్‌గా తెలియజేసింది. ఇటీవల జరిగిన ఈవెంట్‌లో ప్రభాస్‌ను కలిసినప్పుడు, పెళ్లి గురించి అడిగానని సుమ చెప్పారు. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆయన చెప్పినట్టు తెలియజేసింది.
అమ్మాయిల హార్ట్స్ బ్రేక్ చేయకూడదనే తాను పెళ్లి చేసుకోవట్లేదని ప్రభాస్ తనతో చెప్పాడంటూ సుమ కామెంట్ చేసింది. ఇంక వేరే ఏదో కారణం ఉంటుందేమో అని అందరు అనుకోగా, సుమ చేసిన సరదా వ్యాఖ్యలు అందరిని షాక్‌కి గురి చేశాయి. భలేగా ఫ్లవర్స్ చేశావుగా సుమ అంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే రీసెంట్‌గా ప్రభాస్ పెద్దమ్మ శ్యామల.. ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్ చేసింది. త్వరలో పెళ్లి చేసుకుంటాడని, అందులో సందేహం చెందాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొంది. ఇక ప్రభాస్ నటించిన కల్కి చిత్రం ఇటీవల విడుదల కాగా, ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తుంది.