ఏంటి.. కోట్లు ఖ‌ర్చు పెట్టి లండ‌న్‌లో ప్ర‌భాస్ ఇల్లు కొనుగోలు చేశాడా..!

  • Publish Date - March 31, 2024 / 07:30 PM IST

ఒక‌ప్పుడు టాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన ప్ర‌భాస్ క్రేజ్ ఇప్పుడు ఎల్ల‌లు దాటింది. బాహుబ‌లి సినిమాతో ఆయ‌న పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన సినిమాలు వ‌రుస ఫ్లాప్ అయిన కూడా క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఇప్పుడు ప్ర‌భాస్ త‌న ప్ర‌తి సినిమాకి వంద కోట్ల‌కి పైగా రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్టు తెలుస్తుంది. స‌లార్ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం క్ష‌ణం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఆయ‌న చేస్తున్న సినిమాల‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2829 AD మూవీ ఒక‌టి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 9న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ మూవీపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ కెరీర్ లో తొలి సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. ఇందులో అమితాబచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటాని, కమల్ హాసన్ వంటి భారీ క్యాస్ట్ భాగం కావ‌డంతో మూవీ ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని ప్ర‌తి ఒక్కరు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు ప్ర‌భాస్ రాజా సాబ్ అనే చిత్రాన్ని మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ స‌గ‌భాగం పూర్తైన‌ట్టు స‌మాచారం. ఇక స‌లార్ 2 చిత్రాన్ని ఇదే ఏడాది సెట్స్‌పైకి తీసుకెళ్ల‌నున్నాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ టైటిల్ తో ఒక ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ఇలా ప్ర‌భాస్ రానున్న రోజుల‌లో వ‌రుస సినిమాల‌తో సందడి చేయ‌నున్నాడు. అయితే ప్ర‌భాస్ కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. ఈ క్రమంలో మూవీ షూటింగ్ ఆల‌స్యం అవుతుంది..

అయితే తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ లండన్ లో ఓ విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేశాడని టాక్ న‌డుస్తుంది. షూట్స్, వెకేషన్స్ కోసం లండన్ వెళ్ళినప్పుడు ప్ర‌భాస్ ఆ ఇంటిని అద్దెకి తీసుకునేవాడ‌ట‌.ఆధునిక సౌకర్యాలతో ఎంతో విలాసవంతంగా ఉన్న ఈ ఇంటిపై ముచ్చ‌ట‌ప‌డ్డ ప్ర‌భాస్ ఎట్ట‌కేల‌కి భారీ రేటుకే సొంతం చేసుకున్నాడ‌ట‌. వంద కోట్ల‌కి పైగా ఇచ్చి ప్ర‌భాస్ ఆ ఇంటిని కొనుగోలు చేశాడ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే చాలా మంది బాలీవుడ్ సెల‌బ్స్ లండ‌న్‌లో ఇళ్లు కొనుగోలు చేశారు. ఈ క్ర‌మంలో లండ‌న్‌లో ఇంటిని కొనుగోలు చేసిన తొలి హీరోగా ప్ర‌భాస్ నిలిచాడు. ఇక ప్ర‌భాస్‌కి హైద‌రాబాద్, బెంగ‌ళూరుతో పాటు చాలా ప్రాంతాల‌లో కూడా విలాస‌వంత‌మైన ఇళ్లు ఉన్నాయి. .

Latest News