Pushpa2|అల్లు హీరో అల్లు అర్జున్ ఏపీ ఎలక్షన్స్ సమయంలో తన సొంతింటి మనిషి అయిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కి ప్రచారం చేయకుండా వైసీపీకి చెందిన వ్యక్తికి ప్రచారం చేయడంతో మెగా అల్లు మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ఇప్పటికీ ఈ రెండు ఫ్యామిలీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని, కోల్డ్ వార్ నడుస్తుందని అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు మంచి ముహూర్తం చూస్తున్నట్టుగా తెలుస్తుంది. బన్నీ నటించిన తాజా చిత్రం పుష్ప2 కాగా, ఏపీలో ఓ పెద్ద ఈవెంట్‌కు ప్లాన్ చేసిందట పుష్ప టీమ్. నవంబర్ లాస్ట్ వీక్‌లో పెద్దఎత్తున నిర్వహించే పుష్ప-2 ప్రమోషన్ ప్రొగ్రామ్‌కు స్టార్ హీరో..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించబోతున్నట్టు సమాచారం. ఇందుకోసం అల్లుఅర్జున్ త్వరలోనే పవన్ కల్యాణ్‌తో భేటీ అవుతారని టాక్ వినిపిస్తోంది.
సినిమాలకు టికెట్ రేట్స్ పెంచటం, అదనపు షోలకు పర్మిషన్ విషయంలో అల్లు అర్జున్(Allu Arjun) త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కలిసే అవకాశం ఉంది. అలానే తమ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఆహ్వానం పలుకుతాడంటున్నారు. దీని ద్వారా పవన్‌కు తన మధ్య ఎలాంటి గ్యాప్ లేదని క్లారిటీ ఇవ్వబోతున్నాడంటున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత టికెట్ రేట్స్, బెనిఫిట్ షోలకు పర్మిషన్ వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. మరి ఈ ఈవెంట్‌తో అయిన అల్లు, మెగా వార్‌కి బ్రేక్ పడితే ఫ్యాన్స్‌కి అంతకి మించిన ఆనందం మరొకటి ఉండదు. 2021 డిసెంబర్‌లో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్ (పుష్ప 1) చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ ఇతివృత్తంతో పీరియాడికల్ మూవీగా తెరకెక్కి ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఈ క్రమంలో పుష్ప 2 (Pushpa 2)కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తొలుత ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 15న పుష్ప-2ని విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. కానీ అనూహ్యంగా డిసెంబర్ 6కి సినిమాను వాయిదా వేసారు. మళ్లీ మనసు మార్చుకొని ఈ సినిమాను ఒక రోజు ముందుకు జరిపి అంటే డిసెంబర్ 5వ తేదీన విడుదల చేస్తామని మరో ప్రకటన చేశారు మేకర్స్.