Site icon vidhaatha

మరోసారి దిల్ రాజు Vs మైత్రీ.. సంక్రాంతికి బాక్సాఫీస్‌ వద్ద రచ్చే

పుష్ఫ‌2 ఎఫెక్ట్‌.. పాపం నితిన్‌, వెంకీ కుడుముల కాంబోలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల క‌థానాయిక‌గా రూపొందిన చిత్రం రాబిన్‌హుడ్. ప్ర‌ఖ్యాత మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మించ‌గా ఇప్ప‌టికే అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈక్ర‌మంలో డిసెంబ‌ర్ 20న‌, సినిమాను విడుద‌ల చేస్తామ‌ని మొద‌ట ప్ర‌క‌టించి త‌ర్వాత 25కు మార్చారు. తీరా ఈ మేక‌ర్స్ నిర్మించిన పుష్ఫ‌2 సినిమా థియేట‌ర్ల‌లో భారీ క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతుండ‌డంతో దానిని డిస్ట్ర‌బ్ చేయ‌లేక ఇప్పుడు నితిన్ సినిమా విడుద‌ల‌ను మ‌రోసారి వాయిదా వేశారు. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాను సంక్రాతి బ‌రిలోకి తీసుకువ‌స్తున్న‌ట్లు ప్ర‌స్తుతం వార్త‌లు బాగా వైర‌ల్ అవుతున్నాయి. ఇప్ప‌టికే సంక్రాంతికి బాల‌కృష్ణ డాకూ మ‌హారాజ్‌, రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్‌, వెంక‌టేశ్ సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాల విడుద‌ల ఉండ‌డంతో బాక్సాపీస్ వ‌ద్ద మ‌రోసారి ర‌చ్చ మాములుగా ఉండ‌దు అన్న‌ట్లుగా ఉంది. అయితే వీటిలో రెండు చిత్రాల‌కు దిల్ రాజు నిర్మాత కాగా డాకూ మ‌హారాజ్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుండ‌డం.. ఇప్పుడు దీనికి పోటీగా మైత్రీ వారి రాబిన్ హుడ్ రానుండ‌డంతో మ‌రోసారి దిల్ రాజు వ‌ర్సెస్ మైత్రీ పోటీ నెల‌కొని సంక్రాంతి ఫైట్ మరింత రంజుగా మార‌నుంది.

Exit mobile version