Site icon vidhaatha

Mahesh Babu|మ‌హేష్ బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా మూవీ అప్‌డేట్ లేదు, క‌నీసం రాజ‌మౌళి నుండి విషెస్ లేదేంటి?

Mahesh Babu| ఆగ‌స్ట్ 9న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బ‌ర్త్ డే కావ‌డంతో ఆయ‌న అభిమానులు ఎంత హంగామా చేశారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మురారి రిలీజ్ సంద‌ర్భంగా థియేట‌ర్స్‌లో ర‌చ్చ చేశారు. ఇక అన్న‌దానాలు, ర‌క్త‌దానాలు ఇలా మాములు హంగామా చేయ‌లేదు. ఇక మ‌హేష్ బర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న‌కి రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలతో పాటు ప‌లువురు ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.ఇక మ‌హేష్ బాబు ప్ర‌తి బ‌ర్త్ డేకి ఆయ‌న మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఏదో ఒక‌టి వ‌స్తుంది. కాని ఈ సారి మాత్రం అలాంటిది ఏమి రాలేదు. కనీసం రాజమౌళి నుంచి బర్త్ డే విషెస్ కూడా రాలేదు.రాజమౌళి తన సోషల్ మీడియా ఖాతాల్లో ఎక్కడా కూడా మహేష్ బాబు బర్త్ డే విషెస్ కూడా చెప్ప‌లేదు.

రానున్న రోజుల‌లో మ‌హేష్ బాబుతో భారీ బ‌డ్జెట్ తీసే రాజ‌మౌళి.. మ‌హేష్ బాబుకి ఎందుకు విషెస్ చెప్ప‌లేదు అనే చ‌ర్చ న‌డుస్తుంది. ఇద్దరికి ఏమైన చెడిందా, SSMB 29 ప్రాజెక్ట్ ఆగిందా అని ప‌లువురు ప‌లు ర‌కాలుగా ముచ్చ‌టించుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో చెబితేనే చెప్పినట్టు కాద‌ని, పర్సనల్‌గా కాల్ చేసి చెప్పి ఉండొచ్చు కదా? అని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక మ‌హేష్‌- రాజ‌మౌళి మూవీ గురించి గ‌త కొద్ది రోజులుగా జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ తో జంగిల్ అడ్వెంచర్ డ్రామా తెరకెక్కించనున్నారు. మహేష్ బాబు పాత్ర, క్యారెక్టరైజేషన్ పై రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ చేసిన అనధికారిక ప్రకటనలు మాత్రం అంచ‌నాలు పీక్స్‌కి తీసుకెళ్లాయి.

ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నాడు. లొకేషన్స్ వేట దాదాపు పూర్తైంది. మహేష్ మరోవైపు మేకోవర్ అవుతున్నాడు. మ‌హేష్ – రాజ‌మౌళి మూవీ ఉండ‌దు అనే వార్త‌ల‌లో ఏ మాత్రం నిజం లేద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. ఇటీవ‌ల విజయేంద్ర ప్రసాద్ చిత్ర షూటింగ్ గురించి మాట్లాడుతూ మూవీ చిత్రీక‌ర‌ణ‌ మే లేదా జూన్ లో మొదలవుతుంది అన్నారు. కానీ అలాంటి సూచనలు కనిపించ‌డం లేదు. ఈ ఏడాది చివరికైనా ఎస్ఎస్ఎంబీ 29 పట్టాలెక్కుతుందా? అనే సందేహాలు అంద‌రిలో మెదులుతున్నాయి.

Exit mobile version