RAm Charan| ఇటీవల కాలంలో పిఠాపురం పేరు ఎంత మార్మోగిందో మనం చూశాం. అందుకు ముఖ్య కారణం అక్కడ జనసేన తరపున పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిఠాపురం నుండి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారో అప్పటి నుండి ఆ పేరు నిత్యం వార్తలలో నిలిచింది. ఇక పవన్‌కి సపోర్ట్‌గా పలువురు సెలబ్రిటీలు అక్కడకి వెళ్లి తెగ ప్రచారాలు చేయడం కూడా మనం చూశాం. పిఠాపురం ఎన్నికల రిజల్ట్ పై ఎవరి అంచనాలు వాళ్ళకి ఉన్నాయి. జనసేన పార్టీ నాయకులు, పవన్ అభిమానులు అయితే పవన్ ఇక్కడి నుంచి భారీ మెజారితో విజయం సాధిస్తారని ఆశిస్తున్నారు. అయితే ప్రచారం చివరి రోజు రామ్ చరణ్ తన తల్లితో కలిసి పిఠాపురంకి వెళ్లిన విషయం తెలిసిందే.
రామ్ చరణ్ రాకతో ఆ ప్రాంతం అంతా జనాలతో కిక్కిరిసిపోయింది. రామ్ చరణ్‌ని చూసేందుకు ఆయనని స్వయంగా చూడాలని చాలా మంది ఆరాటపడ్డారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ మరోసారి పిఠాపురానికి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల రిజల్ట్ వచ్చిన మరోసారి రోజే అంటే జూన్ 5న పిఠాపురంకి రామ్ చరణ్ వెళ్లనున్నట్టు సమాచారం. అయితే ఈ సారి రాజకీయంగా కాకుండా సినిమా ఈవెంట్‌కి గెస్ట్‌గా వెళ్లనున్నాడని టాక్. శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన మనమే చిత్రం జూన్ 7న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 5న పిఠాపురంలో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మరోసారి రోజే పిఠాపురంలో మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే సినిమాకి మంచి ప్రమోషన్ దక్కుతుందని మనమే చిత్ర యూనిట్ భావిస్తుందట. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రాంచరణ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారట. ఒక వేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే.. మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాంచరణ్ కి వచ్చే రెస్పాన్స్ ఓ రేంజ్‌లో ఉండడం ఖాయం. చూడాలి మరి దీనిపై మేకర్స్ ఎలాంటి అప్‌డేట్ ఇస్తారో. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
మరోసారి పిఠాపురానికి రామ్ చరణ్.. కారణం ఏంటంటే..!
ఇటీవల కాలంలో పిఠాపురం పేరు ఎంత మార్మోగిందో మనం చూశాం. అందుకు ముఖ్య కారణం అక్కడ జనసేన తరపున పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిఠాపురం నుండి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారో అప్పటి నుండి ఆ పేరు నిత్యం వార్తలలో నిలిచింది. ఇక పవన్‌కి సపోర్ట్‌గా పలువురు సెలబ్రిటీలు అక్కడకి వెళ్లి తెగ ప్రచారాలు చేయడం కూడా మనం చూశాం. పిఠాపురం ఎన్నికల రిజల్ట్ పై ఎవరి అంచనాలు వాళ్ళకి ఉన్నాయి. జనసేన పార్టీ నాయకులు, పవన్ అభిమానులు అయితే పవన్ ఇక్కడి నుంచి భారీ మెజారితో విజయం సాధిస్తారని ఆశిస్తున్నారు. అయితే ప్రచారం చివరి రోజు రామ్ చరణ్ తన తల్లితో కలిసి పిఠాపురంకి వెళ్లిన విషయం తెలిసిందే.