Ram Charan launched APL | ఆర్చరీ ప్రీమియర్​ లీగ్​ను ప్రారంభించిన రామ్​ చరణ్​

Archery Premier League (APL) బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన రామ్ చరణ్, ఢిల్లీలో తొలి సీజన్ ప్రారంభోత్సవానికి హాజరై క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. హైదరబాద్​ దసరా వేడుకల్లో విల్లు ఎక్కుపెట్టి అభిమానులను అలరించారు.

Ram charan inaugurated APL at Delhi

Archery Premier League Debuts in Delhi with Ram Charan as Brand Ambassador

న్యూఢిల్లీ/హైదరాబాద్‌:

Ram Charan launched APL | భారత ధనుర్విద్యా సంఘం(Archery Association of India-AAI) ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా నిర్వహించబోతున్న Archery Premier League (APL) ఘనంగా ఆరంభమైంది. అక్టోబర్ 2న ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన తొలి సీజన్ ప్రారంభ వేడుకకు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

AAI రామ్ చరణ్‌ను APL బ్రాండ్ అంబాసిడర్​గా ప్రకటించిన విషయమ విదితమే. భారతీయ విలువిద్యకు రాయబారిగా ఆయన స్టార్ పవర్, రాక కొత్త ఉత్సాహాన్ని నింపిందని పాల్గొన్న విలుకాండ్రు, అధికారులు సంతోషం వ్యక్తం చేసారు.

Archery Premier League(APL) వివరాలు:

AAI అధ్యక్షుడు అర్జున్ ముండా మాట్లాడుతూ –
“భారత గ్రామాల నుంచి పుట్టుకొచ్చిన యువ విలుకాండ్ర కలలను నెరవేర్చే వేదిక ఇదే. రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్ మద్దతు లభించడం మాకు బలాన్నిస్తుంది” అన్నారు. కార్యదర్శి విరేంద్ర సచ్దేవా వ్యాఖ్యానిస్తూ – ఇది కేవలం లీగ్ మాత్రమే కాదు.. భారత ఆర్చరీకి ఒలింపిక్ కలల దిశగా వేసిన కొత్త అడుగు. రామ్ చరణ్ రాయబారిగా ఈ లీగ్ విశ్వవ్యాప్తమవుతుందన్నారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ, ధనుర్విద్య అనేది క్రమశిక్షణ, ఏకాగ్రత, రెసిలియన్స్‌కు ప్రతీక. ఇవి నాకు చాలా దగ్గరైన విలువలు. Archery Premier League భారత ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. యువతకు ఇది గొప్ప ప్రేరణగా నిలుస్తుందన్నారు.అలాగే తన RRR సినిమా షూటింగ్ సమయంలో విల్లు, బాణం పట్టిన అనుభవం తనలో విలువిద్యపై ప్రత్యేక గౌరవాన్ని కల్పించిందని గుర్తు చేశారు.

దసరా రోజు హైదరాబాద్‌లో జరిగిన వేడుకల్లో రామ్ చరణ్ విల్లు ఎక్కుపెట్టి రావణుని ప్రతిమపై బాణాలు సంధించారు. ఆయన భార్య ఉపాసన కొణిదెల ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది వైరల్‌గా మారింది. వర్షాన్ని లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. “వర్షం పడుతున్నా ఇక్కడికి వచ్చి మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు” అంటూ రామ్ చరణ్ సభను ఉద్దేశించారు.

ఆస్కార్ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఇప్పుడు భారత ధనుర్విద్యకు గౌరవ రాయబారిగా ఉండటం, ఢిల్లీలో APL లాంచ్ ఈవెంట్, దసరా వేడుకల్లో శర సంధానం – వీటితో మెగా పవర్‌స్టార్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. క్రీడలకు ప్రోత్సాహం, సినిమాల్లో విజయాలు – రెండు రంగాల్లోనూ ఆయన అడుగులు ఆయనలో కొత్త శక్తిని సృష్టిస్తున్నాయి.

Exit mobile version