Site icon vidhaatha

Ram Charan| రామ్ చ‌ర‌ణ్ తన ఫోన్‌లో ఎవ‌రి ఫొటోని వాల్‌పేప‌ర్‌గా పెట్టుకున్నాడు.. నిజం తెలిస్తే షాక‌వుతారు..!

Ram Charan| మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో “గేమ్ చేంజర్” అనే చిత్రం చేస్తుండ‌గా, ఈ భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో చరణ్ బాధ్యతగల పాత్రల్లో కనిపించి మెప్పించ‌నున్నాడు. రీసెంట్‌గా చెన్నైలో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన చ‌ర‌ణ్ కాస్త ఫ్రీ అయిన‌ట్టు తెలుస్తుంది. మొన్న త‌న తండ్రి ప‌ద్మ‌విభూష‌ణ్ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మంకి వెళ్లిన రామ్ చ‌ర‌ణ్ రీసెంట్ గా పిఠాపురం వెళ్లాడు. అక్క‌డ బాబాయ్‌తో క‌లిసి తెగ సంద‌డి చేశాడు. అయితే రామ్ చ‌రణ్‌కి గ్లోబ‌ల్ ఇమేజ్ రావ‌డంతో ఆయ‌న‌కి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది.

ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ఫోన్‌కి సంబంధించిన వార్త సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. చ‌ర‌ణ్ త‌న భార్య ఉపాస‌న‌తో క‌లిసి రీసెంట్‌గా ఢిల్లీ వెళ్ల‌డం మ‌నం చూశాం. అక్క‌డ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకోగా, ఆ కార్య‌క్ర‌మానికి రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న సైతం హాజ‌ర‌య్యారు. అయితే ఆ కార్య‌క్ర‌మానికి వెళుతున్న స‌మ‌యంలో రామ్ చరణ్ చేతిలో ఉన్న ఫోన్ వాల్ పేపర్ పిక్చర్ మీడియా కంటపడింది. ఇన్నాళ్లు ఆయ‌న అభిమానులు రామ్ చ‌ర‌ణ్ త‌న ఫోన్ వాల్ పేప‌ర్‌గా త‌న తండ్రి ఫోటోనో, లేకుంటే భార్య ఫోటోనో, అదీ కాదంటే క్లింకార‌ది పెట్టుకొని ఉంటాడు అని అనుకున్నారు.

కాని తాజాగా మీడియా కంట ప‌డ్డ ఫోటో చూసి షాక‌య్యారు. రామ్ చరణ్ పూర్తిగా దైవస్మరణ కలిగిన వ్యక్తి కాబట్టి, ఆయ‌న త‌న ఫ్యామిలీ ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టుకున్నారు . ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండ‌గా, రామ్ చ‌ర‌ణ్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. చ‌ర‌ణ్ ఎంత భ‌క్తిభావంతో మెలుగుతున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, చ‌ర‌ణ్ ప్ర‌తి ఏడాది అయ్య‌ప్ప మాల ధ‌రించ‌డం కూడా మ‌నం చూస్తూనే ఉన్నాం

Exit mobile version