Ramoji Rao| 1999లో ఆ చిత్రాలు తీసి ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిన రామోజీరావు..!

Ramoji Rao| ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు స్వ‌ర్గ‌స్తుల‌య్యారు. జూన్ 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబసభ్యులు నానక్‌రామ్‌గూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అ

  • Publish Date - June 8, 2024 / 07:29 AM IST

Ramoji Rao| ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు స్వ‌ర్గ‌స్తుల‌య్యారు. జూన్ 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబసభ్యులు నానక్‌రామ్‌గూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పుడు వైద్యులు రామోజీరావుని ప‌రీక్షించి గుండె సంబంధిత సమస్య ఉన్నట్టు గుర్తించి, స్టెంట్‌ అమర్చారు. అయితే శుక్ర‌వారం మ‌ధ్యాహ్నాం స‌మ‌యంలో ఆయ‌న ఆరోగ్యం అంత‌గా బాగా లేక‌పోవ‌డంతో వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ తెల్ల‌వారుఝామున ఆయ‌న స్వ‌ర్గ‌స్తుల‌యిన‌ట్టు ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ప్రస్తుతం రామోజీరావు వయసు 88 ఏళ్లు. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 18న ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో జ‌న్మించిన రామోజీరావు గుడివాడలో విద్యాభ్యాసం పూర్తిచేశారు.

రామోజీరావు సినిమా రంగంలో కూడా త‌న‌దైన ముద్ర వేశారు. ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టు సినిమాలు నిర్మించ‌డంలో ఆయ‌న‌కి ఆయ‌నే సాటి. 1999లో ఆయ‌న కొన్ని ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు తీశారు ఉషాకిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మాణ సారథ్యంలో వచ్చిన ‘చిత్రం’,‘నువ్వే కావాలి’ చిత్రాలు 1999లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచాయి. చిత్రం సినిమాతో తేజ అనే నూతన దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ రామోజీరావు నిర్మించిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్టైందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమాతో చాలా మంది న‌టీన‌టుల‌ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు. ఇంటర్ చదివే హీరో, హీరోయిన్స్ చ‌దువు పూర్తి కాక మునుపే పేరెంట్స్ అయితే ఎలా ఉంటుందనే స్టోరిలైన్ తో వచ్చిన ఈ సినిమా రికార్డు విజయం సాధించింది.

ఇక రామోజీరావు నిర్మించిన మ‌రో చిత్రం ‘నువ్వేకావాలి’. ‘నిరమ్’ అనే మలయాళ మూవీ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా తరుణ్, రిచా పల్లోడ్ నటించారు. ఫ్రెండ్స్ గా ఉన్న హీరో, హీరోయిన్స్ తమ మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ మాత్రమే కాదు ప్రేమని చివరకు తెలుసుకోవడం తో క‌థ సుఖాంతం అవుతుంది. కె. విజ‌య భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామోజీరావు నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు డైలాగ్స్ తో పాటు స్క్రీన్ ప్లే అందించారు. కోటి అందించిన మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఈ చిత్రం త‌రుణ్ కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. రామోజీరావు ఇవే కాకుండా ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో శ్రీవారికి ప్రేమలేఖ, మయూరి, మౌన పోరాటం, ప్రతిఘటన, మూడు ముక్కలాట, చిత్రం, వంటి పలు చిత్రాలను నిర్మించారు

Latest News