Ramya Sri| బ్లూ ఫిలిమ్స్ చేయ‌మ‌ని నాపై ఒత్తిడి తెచ్చేవారు.. దారుణంగా విమ‌ర్శించేవారు

Ramya Sri|  1997లో కోరుకున్న ప్రియుడు సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది న‌టి ర‌మ్య శ్రీ. ఆమె కన్న‌డ‌లో నటించిన ఆర్య‌భ‌ట్ట సినిమాతో జాతీయ అవార్డ్ కూడా ద‌క్కించుకుంది. తెలుగులో ఓ మ‌ల్లి అనే చిత్రం ర‌మ్య‌కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే అప్ప‌ట్లో ఆమె ఎక్కువ‌గా ఐటెం సాంగ్స్

  • Publish Date - July 1, 2024 / 09:57 AM IST

Ramya Sri|  1997లో కోరుకున్న ప్రియుడు సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది న‌టి ర‌మ్య శ్రీ. ఆమె కన్న‌డ‌లో నటించిన ఆర్య‌భ‌ట్ట సినిమాతో జాతీయ అవార్డ్ కూడా ద‌క్కించుకుంది. తెలుగులో ఓ మ‌ల్లి అనే చిత్రం ర‌మ్య‌కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే అప్ప‌ట్లో ఆమె ఎక్కువ‌గా ఐటెం సాంగ్స్ లో, వ్యాంప్ తరహా పాత్రల్లో నటించేది. నువ్వు నేను, ఆది, సింహాద్రి, యమగోల మళ్ళీ మొదలయింది లాంటి చిత్రాల్లో రమ్యశ్రీ అలాంటి పాత్ర‌లే పోషించి మెప్పించింది. కొన్ని చిత్రాల‌లో హాఫ్ న్యూడ్‌గా కూడా న‌టించింది. ఆ స‌మ‌యంలో ఎన్నో విమర్శ‌లు త‌న‌పై చేసార‌ని పేర్కొంది. కొంద‌రు కారులోనే త‌న‌పై బ‌ల‌వంతం చేసే ప్ర‌య‌త్నం చేశారంటూ కూడా వాపోయింది ర‌మ్య శ్రీ.

 


ఇక త‌న‌ని ఈవెంట్స్‌కి పిల‌వాల‌న్నా కూడా ఆలోచించేవార‌ట‌.అస‌భ్యంగా బ‌ట్ట‌లు వేసుకుంటుంది ఎందుకు అని విమ‌ర్శించేవార‌ట‌. అలా చాలా సార్లు త‌ను ఇబ్బందులు ఎదుర్కొన్న‌ట్టు తెలియ‌జేసింది.అయితే త‌న‌ని న‌మ్మిన ద‌ర్శ‌కుల కోసం ప‌ని చేయాలి క‌దా, వారు వారిన కోరిన విధంగా బ‌ట్టలు వేసుకోవాలి క‌దా అని రమ్య శ్రీ స్ప‌ష్టం చేసింది. ఒకసారి అమెరికాలో ఈవెంట్ జరిగిన‌ప్పుడు న‌న్ను పిల‌వాలని అనుకున్నారు. అయితే కొంద‌రు మాత్రం ఆమె బ‌ట్ట‌లు దారుణంగా వేసుకుంటుంది, ఎందుకు పిల‌వడం అన్నార‌ట‌. అయితే మ‌రి కొంద‌రు మాత్రం ఇక్క‌డ మ‌నం కూడా వేసుకునేవి పొట్టి బ‌ట్ట‌లే క‌దా అని సపోర్ట్ చేసి ఆ త‌ర్వాత ఆమెని ఇన్వైట్ చేశార‌ట‌.

ఇక న‌న్ను ఈవెంట్‌లో చూసిన వారంద‌రు సినిమాలలో అలా క‌నిపిస్తారు, ఇక్క‌డ ఇంత డీసెంట్‌గా ఉన్నారు ఏంటి ఆమెపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించార‌ట‌. ఇక చాలా మంది కూర్చొని డిన్న‌ర్ చేస్తున్న స‌మ‌యంలో పెద్దాయ‌న లేచి న‌న్ను ఉద్దేశిస్తూ… చీర కట్టిన ప్రతి ఆడది పతివ్రత కాదు, డ్రెస్ ని చూసి అంచనా వేయకూడదు అని చెప్పిన‌ట్టు ర‌మ్య శ్రీ పేర్కొంది. ఇక త‌న‌కు బ్లూ ఫిలిమ్స్ లో న‌టించ‌మ‌ని చాలా మంది ఒత్తిడి చేశార‌ట‌. చేయ‌న‌ని తెగించి చెప్పాను. లాయ‌ర్‌ని పెట్టుకొని మ‌రీ వాదించాను. ఆ జోలికి నేను వెళ్ల‌ను అని ఖ‌రా ఖండీగా చెప్పాన‌ని ర‌మ్య‌శ్రీ పేర్కొంది. ప్ర‌స్తుతం ఆమె వ్యాఖ్య‌లు నెట్టింట‌
చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Latest News