Site icon vidhaatha

Rana| ప్ర‌భాస్ ఎవ‌రు, మ‌హేష్ బాబు న‌మ్ర‌త భ‌ర్త‌నా.. రానా షాకింగ్ కామెంట్స్ వైర‌ల్

Rana| ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో కొన్ని పాత వీడియోలు వైర‌ల్ అవుతుండ‌గా, అవి జ‌నాల‌లో డిస్క‌ష‌న్ పాయింట్‌గా మారుతున్నాయి. ఒక‌ప్పుడు బాలీవుడ్ మ‌నవాళ్ల‌ని ఎంత చూపు చూసింద‌న్న దానికి తాజా వీడియోనే నిద‌ర్శ‌నం. లీడ‌ర్ సినిమాతో టాలీవుడ్ హీరోగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన రానా ఆ త‌ర్వాత తెలుగులోనే కాక త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల‌లో ప‌లు సినిమాలు చేశారు. అయితే బాహుబ‌లితో రానాకి మంచి గుర్తింపు ద‌క్కింది.బాహుబ‌లి సినిమాకి ముందు కూడా హిందీలో ప‌లు సినిమాలు చేశాడు రానా. అయితే బాహుబ‌లి మూవీ టైంలో రానా బాలీవుడ్‌కి ప‌ని మీద వెళ్లాడ‌ట‌. అక్క‌డ ప‌రిచ‌యం ఉన్న వారితో బాహుబ‌లి సినిమా గురించి చెప్పార‌ట‌. అప్పుడు బాహుబలిగా ఎవరు నటిస్తున్నారని వారు అడిగారట. ప్రభాస్ నటిస్తున్నాడని చెబితే.. ప్రభాస్ ఎవరు ? అని వారు అన్న‌ట్టు రానా ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపాడు.

అయితే ప్ర‌భాస్ గురించి చెప్పేందుకు తాను మిర్చి, ఛత్రపతి సినిమాలు చూశారా ? అని వారిని అడిగాను. అప్పుడు వారు చూడ‌లేద‌ని చెప్పారంటూ రానా పేర్కొన్నాడు. అప్ప‌ట్లో వారికి చిరంజీవి, వెంకటేష్ మాత్ర‌మే తెలుస‌ట‌. ఈ జ‌న‌రేష‌న్ హీరోస్ గురించి అస్సలు తెలియ‌ద‌ట‌. అయితే న‌మ్ర‌త భ‌ర్త‌గా మ‌హేష్ బాబు తెలుస‌ని చెప్పారంటూ రానా పేర్కొన్నాడు. ఇక ఇండియా నుంచి వచ్చే పెద్ద థింగ్‌ కల్కి సినిమా అవుతుందని, ఇప్పుడు అంద‌రు కూడా దాని గురించే డిస్క‌స్ చేసుకుంటున్నార‌ని తెలిపాడు. అవెంజర్స్ రేంజ్‌లో ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉంటుంద‌ని తెలిపాడు. ఇక రజినీకాంత్ వేట్టయాన్ గురించి కూడా మాట్లాడాడు. వేట్టయాన్ మూవీ అసలు రజినీకాంత్ స్టైల్లో ఉండదని, అలాంటి డిఫరెంట్ సినిమాను ఆయన ఒప్పుకున్నందుకు, అందులో నేను నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంద‌ని కూడా రానా తెలియ‌జేశాడు.

వేట్ట‌యాన్ చిత్రంలో అమితాబ్, ఫాహద్ ఫాజిల్ ఇలా చాలా భారీ క్యాస్టింగ్ ఉంటుందని, ఈ సినిమా రీసెర్చ్ చేసి రాసిన స్టోరీలా ఉంటుందని, జ్యుడీషయల్, పొలీస్, ఎంటర్ ప్రెన్యూర్ ఇలా చాలా యాంగిల్స్‌లో రూపొందిన‌ట్టు రానా తెలియ‌జేశాడు. విరాట ప‌ర్వం త‌ర్వాత రానా హీరోగా మరో సినిమా రాలేద‌ని చెప్పాలి. ఇప్పుడు ఆయ‌న స‌పోర్టింగ్ రోల్స్ లో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాడు. వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ సంద‌డి చేస్తున్నాడు.

Exit mobile version