Rashmi Gautham| ఏంటి.. ర‌ష్మీకి అంత భ‌యంక‌ర‌మైన వ్యాధి ఉందా.. ఇన్నాళ్ల‌కి బ‌య‌ట‌పెట్టిందిగా..!

Rashmi Gautham| జ‌బర్ధ‌స్త్ షోతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన అందాల యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్. ఒక‌ప్పుడు న‌టిగా ప‌లు సినిమాల‌లో సంద‌డి చేసిన ఈ భామ‌కి పెద్ద‌గా గుర్తింపు ల‌భించ‌లేదు. దీంతో జ‌బ‌ర్ధ‌స్త్ షోకి యాంక‌ర్‌గా వ‌చ్చింది. ఈ షో ద్వారా ర‌ష్మీ గౌత‌మ్ క్రేజ్ పెర‌గ‌డంతో ఈ భామ ఇప్పుడు బుల్లితెర‌ని ఓ

  • Publish Date - June 29, 2024 / 09:55 AM IST

Rashmi Gautham| జ‌బర్ధ‌స్త్ షోతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన అందాల యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్. ఒక‌ప్పుడు న‌టిగా ప‌లు సినిమాల‌లో సంద‌డి చేసిన ఈ భామ‌కి పెద్ద‌గా గుర్తింపు ల‌భించ‌లేదు. దీంతో జ‌బ‌ర్ధ‌స్త్ షోకి యాంక‌ర్‌గా వ‌చ్చింది. ఈ షో ద్వారా ర‌ష్మీ గౌత‌మ్ క్రేజ్ పెర‌గ‌డంతో ఈ భామ ఇప్పుడు బుల్లితెర‌ని ఓ ఊపు ఊనేస్తుంది. ప్ర‌స్తుతం `జబర్దస్త్` రెండు ఎపిసోడ్లు, `శ్రీదేవి డ్రామా కంపెనీ`తో పాటు ప‌లు స్పెష‌ల్ ఈవెంట్స్‌కి కూడా యాంకర్‌గా చేస్తుంది. ఒక సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటూ సంద‌డి చేస్తూ ఉంటుంది. అయితే ర‌ష్మీ గౌత‌మ్ వ‌య‌స్సు ఇప్పుడు నాలుగు ప‌దుల‌కి ద‌గ్గ‌ర‌గా ఉంది. కాని ఇంకా పెళ్లి ఊసైతే ఎత్త‌డం లేదు.

జబర్దస్త్ మాజీ కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌తో ఈ అమ్మ‌డు ప్రేమాయ‌ణం న‌డుపుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతున్నా కూడా అందులో క్లారిటీ లేదు.ఇక ర‌ష్మీ జంతు ప్రేమికురాలు అన్న విష‌యం తెలిసిందే. జంతువుల‌ని ఎవ‌రు హింసించిన‌, వాటిని ఇబ్బంది పెట్టిన కూడా వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటుంది.త‌న‌పై ఎవరైనా విమర్శలు చేసినా, సెటైర్లు వేసినా, పంచ్‌లు వేసినా కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుంటుంది. అయితే ర‌ష్మీ అలా ఉండ‌డానికి బ‌ల‌మైన కార‌ణం ఉంద‌ట‌. ఆమె `రూమటాయిడ్‌ సమస్య`తో బాధపడుతుందట. ఇదోక ఆటో ఇమ్యూన్‌ సమస్య అని చెబుతున్న ఈ భామ ఆ వ్యాధి వ‌ల‌న రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంద‌ని పేర్కొంది.ఈ స‌మ‌స్య వ‌ల‌న రష్మి బరువు పెరగడం, తగ్గడం చేస్తుందట.

ఇలాంటి వ్యాధితో త‌న భ‌ర్త కూడా ఇబ్బంది ప‌డుతున్నాడ‌ని, దానికి చికిత్స ఏంట‌ని ఓ నెటిజ‌న్ ర‌ష్మీని అడిగాడు. దానికి స్పందించిన ర‌ష్మి ఈ సమస్యకి చికిత్స లేదని, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఫలితం ఉంటుందని పేర్కొంది.. 12ఏళ్ల వయసులో ఈ వ్యాధి తీవ్రతని తగ్గించేందుకు తీవ్రంగా నొప్పి ఉండే ఇంజిక్షన్లు తీసుకున్నట్టు తెలియ‌జేసింది. మా అమ్మ చెప్పిన కొన్ని చిట్కాలు పాటిస్తూ వ‌చ్చాన‌ని తెలిపింది. ఒత్తిడి తగ్గించుకోవాలని, నెగటివిటీకి దూరంగా ఉండాలని, పాజిటివ్‌ మైండ్‌తో ఉండాలంటూ ర‌ష్మీ తెలియ‌జేసింది. అయితే ఇది ఆరేళ క్రితం నాటి విష‌యం కాగా, ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఈ వార్త వైర‌ల్ అవుతుంది. అయితే ఇప్పుడు ర‌ష్మీ ఆ స‌మ‌స్య నుండి కోలుకుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు

Latest News