Site icon vidhaatha

Raveena Tandon| ర‌వీనా టాండ‌న్‌పై దాడి..కొట్టొద్ద‌ని వేడుకున్నా విన‌లేదుగా..!

Raveena Tandon| బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ఈ అమ్మ‌డు రెండు ద‌శాబ్ధాలుగా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని మెప్పిస్తూ వ‌స్తుంది. ర‌వీనా తెలుగు సినిమాల‌లో కూడా న‌టించి అల‌రించింది. తాజాగా ర‌వీనా టాండ‌న్‌పై దాడి తీవ్ర క‌ల‌క‌లం రేపింది. వివ‌రాల‌లోకి వెళితే బాలీవుడ్ నటి రవీనా టాండన్ కారు తన తల్లిని ఢీకొట్టిందంటూ ఓ వ్యక్తి రవీనా డ్రైవర్‌పై చేయి చేసుకున్నాడు. ఆ స‌మ‌యంలో మ‌రి కొంద‌రు అక్క‌డికి చేరుకోవ‌డంతో గొడ‌వ పెద్ద‌దైంది. అయితే స్థానికులు ర‌వీనా టాండ‌న్‌పై కూడా దాడి చేసే ప్ర‌య‌త్నం చేశారు. మూకుమ్మ‌డిగా ర‌వీనా డ్రైవ‌ర్‌పై దాడి చేస్తుండ‌డంతో ర‌వీనా వారిని నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేసింది.

వద్దువద్దని రవీనా మొత్తుకుంటున్నా వినకుండా ఆమెపైకీ దూసుకెళ్లారు. ఆమెను చెయ్యిపట్టి లాగడం వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై తాజాగా ముంబై పోలీసులు స్పందించారు. రవీనా కారు ఎవరినీ ఢీకొట్టనే లేదని తమ దర్యాప్తులో తేలినట్టు చెప్పుకొచ్చారు. సీసీటీవీ ఫుటేజీలో కారు ఆ మహిళ సమీపం నుంచి వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. శనివారం రాత్రి బాంద్రాలోని కార్టర్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన తల్లి, సోదరితో కలిసి రవీనా ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. కారు తగిలిందంటూ తొలుత డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగిన మహిళ కుమారుడు.. ఆపై స్థానికులతో కలిసి దాడిచేశాడు. . ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

మద్యం మత్తులో ఉన్న రవీనా, ఆమె డ్రైవర్ ఓ పెద్దావిడ మీద దాడి చేశారనే వాదన కూడా వినిపిస్తోంది. వీడియోలో రవీనా కొట్టొదని, వీడియోలు తీయోద్ద‌ని వేడుకుంది. అయిన‌ప్పటికీ వినిపించుకోని స్థానికులు ఆమెను చెయ్యిపట్టి లాగి దాడిచేశారు. గుంపులోని ఓ వ్యక్తి గట్టిగా అరుస్తూ.. రవీనా డ్రైవర్ ఆమె తల్లిని ఢీకొట్టాడని, ప్రశ్నిస్తే దాడిచేశాడని చెప్పడం జ‌రిగింది. అంతేకాదు, ‘మారో.. మరో’ అని రెచ్చగొట్టాడు. ఈ ఘటనపై డీసీపీ రాజ్‌ తిలక్ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుడు తప్పుగా ఫిర్యాదు చేశాడని తెలిపారు. తాము మొత్తం సీసీటీవీ ఫుటేజీని చెక్ చేశామని, కారు ఢీకొట్టినట్టు ఎక్కడా లేదని అన్నారు.రివ‌ర్స్ చేస్తున్న స‌మ‌యంలో కుటుంబం రోడ్డు దాటుతుండ‌గా, అప్పుడు కారు ఢీకొట్టారంటూ ర‌చ్చ చేశారు. రవీనా టాండన్, ఆరోపిత కుటుంబ సభ్యులు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు అని డీసీపీ చెప్పుకొచ్చాడు.

Exit mobile version