కరోనా దెబ్బకు ర‌వితేజ‌ సినిమా వాయిదా

విధాత‌: కరోనా సినిమా రంగంపై త్రీవ్ర ప్ర‌భావం చూపుతోంది. క‌రోనా దెబ్బ‌కు ఇప్పటికే ఆచార్య, లవ్ స్టోరీ, నారప్ప లాంటి సినిమాలు వాయిదా ప‌డ్డాయి. ఇప్పుడు ఈ కోవ‌లో ర‌వితేజ సినిమా కూడా చేరింది.ర‌వితేజ న‌టిస్తున్న ఖిలాడీ సినిమాను కూడా కోవిడ్ కార‌ణంగా వాయిదా వేశారు. మాస్‌ మహారాజా రవితేజ హీరోగా రమేశ్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ఎంట‌ర్‌టైన‌ర్‌‘ఖిలాడి`. హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి ప్లే స్మార్ట్ అనేది ట్యాగ్‌లైన్‌. ర‌వితేజద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రానికి […]

  • Publish Date - May 6, 2021 / 11:39 AM IST

విధాత‌: కరోనా సినిమా రంగంపై త్రీవ్ర ప్ర‌భావం చూపుతోంది. క‌రోనా దెబ్బ‌కు ఇప్పటికే ఆచార్య, లవ్ స్టోరీ, నారప్ప లాంటి సినిమాలు వాయిదా ప‌డ్డాయి. ఇప్పుడు ఈ కోవ‌లో ర‌వితేజ సినిమా కూడా చేరింది.ర‌వితేజ న‌టిస్తున్న ఖిలాడీ సినిమాను కూడా కోవిడ్ కార‌ణంగా వాయిదా వేశారు.

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా రమేశ్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ఎంట‌ర్‌టైన‌ర్‌
‘ఖిలాడి’. హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి ప్లే స్మార్ట్ అనేది ట్యాగ్‌లైన్‌. ర‌వితేజ
ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రానికి స‌త్య‌నారాయ‌ణ కోనేరు నిర్మాత‌. డా. జ‌యంతీలాల్ గ‌డ
స‌మ‌‌ర్ప‌ణ‌లో ఏ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, టీజర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా మే 28న విడుద‌ల‌కావాల్సిన ఈ చిత్రాన్ని కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా వేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. ఈకరోనా ఉధృతి త‌గ్గాక కొత్త రిలీజ్‌డేట్‌ను ప్ర‌క‌టించనున్నారు. మరోవైపు కరోనా కారణంగా ఈ సినిమాషూటింగ్ ను కూడా నిలిపివేశారు. ఖిలాడీ ఫైనల్ షెడ్యూల్ పెండింగ్ ఉంది.

Latest News