Mass Jathara : ‘మాస్‌ జాతర’ రన్ టైమ్ ఫిక్స్ ..చూసుకో మళ్లా!

మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల జంటగా నటించిన 'మాస్ జాతర' (మాస్, ఫన్, యాక్షన్ ఎంటర్‌టైనర్) సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. సినిమా రన్ టైమ్ 160 నిమిషాలుగా ఖరారు చేశారు. ఈ మూవీ ట్రైలర్‌ను అక్టోబరు 27న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mass Jathara

విధాత : మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మాస్‌ జాతర’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ లభించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం సరికొత్త పోస్టర్‌ను పంచుకుంది. ‘మాస్‌, ఫన్‌ అండ్‌ యాక్షన్‌.. అన్నీ ఒక దానిలోనే! ఎంటర్‌టైన్‌మెంట్‌ మాస్‌ వేవ్‌ను థియేటర్స్‌లో ఆస్వాదించండి’ అని పేర్కొంది. సినిమా నిడివి 160 నిమిషాలుగా ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

27న మూవీ ట్రైలర్ విడుదల

‘మాస్‌ జాతర’ సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో మూవీ ప్రమోషన్ లో భాగంగా వ‌రుస అప్‌డేట్‌ల‌ను చిత్ర‌బృందం వదులుతుంది. తాజాగా ‘మాస్‌ జాతర’ ట్రైల‌ర్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను అక్టోబ‌ర్ 27న(సోమ‌వారం) విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో ర‌వితేజ రైల్వే పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కి భీమ్స్ సెసిరోలియో సంగీతం, భాను బోగవరాపు లిరిక్స్ ఇచ్చారు. ఎనర్జిటిక్ బీట్స్, క్యాచీ ట్యూన్స్ తో సినిమా పాటలు ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. రవితేజ డ్యాన్స్ మూవ్స్, శ్రీలీలల గ్రేస్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ హైలైట్స్‌గా నిలిచాయి. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.