Naga Chaitanya| సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకుల వ్యవహారాలు అంత ఈజీగా ఎవరికి అర్ధం కావు. ఎవరు ఎప్పుడు ప్రేమలో పడతారు, ఎప్పుడు విడిపోతారు అన్నది చెప్పడం చాలా కష్టం. అయితే అక్కినేని యువ హీరో నాగ చైతన్య ఏ మాయ చేశావే సినిమా టైంలో సమంతతో ప్రేమలో పడగా ఆ తర్వాత ఇద్దరి మధ్య బంధం బలపడడం, కొన్నాళ్లకి పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఊహించని విధంగా ఈ జంట 2021లో విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత నాగ చైతన్య .. శోభిత ధూళిపాళతో ప్రేమాయణం నడుపుతున్నాడని ప్రచారం జరిగింది. గత కొంత కాలంగా వస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. వీళ్ళిద్దరూ ఘాడమైన ప్రేమలో ఉన్నారని ఇప్పటికీ క్లారిటీ వచ్చింది.
ఆగస్ట్ 8 ఉదయం ఉదయం 9 గంటల 42 నిమిషాలకు నాగార్జున, శోభిత ధూళిపాలకి నిశ్చితార్థం జరిగినట్లు నాగార్జున స్వయంగా సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా కొత్త జంటని ఆశీర్వదించిన ఫొటోస్ ని నాగార్జున అభిమానులతో పంచుకున్నారు. ఇందులో నాగ చైతన్య సాంప్రదాయ వస్త్రధారణలో గడ్డంతో కనిపించగా, శోభిత లైట్ ఆరెంజ్ కలర్ శారీలో మెరిసిపోయింది. ఈ ఇద్దరు కలిసి నాగార్జునతో ఆప్యాయంగా ఫొటోలకి పోజులిచ్చారు. మరో పిక్ లో శోభిత తనకి కాబోయే భర్త చైతూని ప్రేమగా హగ్ చేసుకుని ఉంది. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఆగస్ట్ 8న నాగ చైతన్య.. శోభితతో ఎంగేజ్‌మెంట్ జరుపుకోవడానికి బలమైన కారణం ఉంది.ఇదే తేదీన సమంత.. నాగ చైతన్యకి ప్రపోజ్ చేసిందట.అయితే ఇప్పుడు తనతో విడిపోయినందుకు ఆమెకి బుద్ది వచ్చేలా నాగ చైతన్య.. ఆ తేదీన శోభితతో పెళ్లికి సిద్ధమయ్యాడని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇలా స్వీట్ రివెంజ్ తీర్చుకోవడానికే నాగ చైతన్య ఆ డేట్‌ని ఫిక్స్ చేసుకున్నాడని అంటున్నారు.ఇక శోభిత- చైతూ పరిచయం వారికి కామన్ గా ఉన్న ఓఫ్రెండ్ బర్త్ డే అని అంటున్నారు. ఆ పార్టీలో వీరు కలిసినట్టు నెట్టింట పెద్ద చర్చ జరిగింది. ఆ బర్త్ డేలోనే వీరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారట. ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోవడం.. తెలుసుకోవడంతో పాటు.. ఆ రోజు నుంచే కలిసి తిరగడం కూడా స్టార్ట్ చేశారని, ఆ క్రమంలో ఇద్దరు కలిసి జీవితం స్టార్ట్ చేయాలని భావించి ఈ రోజు ఎంగేజ్‌మెంట్ జరుపుకున్నారని అంటున్నారు.మధ్య ఏజ్ గ్యాప్ 6 ఏళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. 1986 లో చైతన్య జన్మించగా.. 1992 లో శోభిత పుట్టింది. నాగచైతన్య.. నాగార్జున మొదటి భార్య..రామానాయుడు కూతురు లక్ష్మీ సంతానం కాగా.. శోభిత ధూళిపాళ తెలుగు అమ్మాయి.. తెనాలి అమ్మాయి కావడం విశేషం.